ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభవ్ సూర్యవంశీ!
ప్రస్తుతం ఈ ప్రపంచ రికార్డు కీరన్ పొలార్డ్ పేరిట ఉంది. పొలార్డ్ 843 బంతుల్లో 100 సిక్సర్లు పూర్తి చేయగా, వైభవ్ కేవలం 511 బంతుల్లోనే 99 సిక్సర్లు బాదాడు.
- Author : Gopi
Date : 29-04-2026 - 2:38 IST
Published By : Hashtagu Telugu Desk
Vaibhav Suryavanshi: ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ తన విస్ఫోటక బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ప్రపంచ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. అతి తక్కువ సమయంలోనే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన వైభవ్.. ఇప్పుడు కీరన్ పొలార్డ్ పేరిట ఉన్న ఒక భారీ ప్రపంచ రికార్డును అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చిన మొదటి బంతి నుండే భారీ షాట్లు ఆడటాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటికే 400 పరుగులు సాధించగా, అందులో 350కి పైగా పరుగులు కేవలం ఫోర్లు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. ఈ సీజన్లో వైభవ్ 34 ఫోర్లు, 37 సిక్సర్లతో మొత్తం 358 పరుగులు బాదగా, సింగిల్స్, డబుల్స్ ద్వారా కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు మరో సిక్సర్ బాదితే టీ20ల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలుస్తాడు.
Also Read: Gudivada : టికెట్ తీసుకోకుండా రైలు పైకెక్కిన ప్రయాణికుడు
ప్రస్తుతం ఈ ప్రపంచ రికార్డు కీరన్ పొలార్డ్ పేరిట ఉంది. పొలార్డ్ 843 బంతుల్లో 100 సిక్సర్లు పూర్తి చేయగా, వైభవ్ కేవలం 511 బంతుల్లోనే 99 సిక్సర్లు బాదాడు. అంటే పొలార్డ్ రికార్డును బద్దలు కొట్టడానికి ఇంకా 300లకు పైగా బంతుల అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఒక్క సిక్సర్ బాదితే చాలు. మే 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఈ అద్భుతమైన మైలురాయిని సూర్యవంశీ అందుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు 16 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 652 పరుగులు సాధించి తన సత్తా చాటుకున్నాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతేడాది కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా శతకం చేసిన భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన వైభవ్, ఈ ఏడాది కూడా 36 బంతుల్లోనే సెంచరీ సాధించి తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
