Urvashi Rautela Trolls Rishabh Pant: నేను పంత్ హైట్ గురించి మాట్లాడలేదు: ఊర్వశి
గత కొంతకాలంగా క్రికెటర్ రిషబ్ పంత్, నటి ఊర్వశి రౌతేలా మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. ఊర్వశి రౌతేలా నిత్యం పంత్ పై ఎదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంది. పంత్ నాతో డేటింగ్ చేయాలనీ ఆశ పడుతున్నడని ఆమె బాంబ్ పేల్చింది. దీంతో పంత్ వెంటనే రియాక్ట్ అయి ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
- By Praveen Aluthuru Published Date - 06:56 PM, Mon - 1 April 24

Urvashi Rautela Trolls Rishabh Pant: గత కొంతకాలంగా క్రికెటర్ రిషబ్ పంత్, నటి ఊర్వశి రౌతేలా మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. ఊర్వశి రౌతేలా నిత్యం పంత్ పై ఎదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంది. పంత్ నాతో డేటింగ్ చేయాలనీ ఆశ పడుతున్నడని ఆమె బాంబ్ పేల్చింది. దీంతో పంత్ వెంటనే రియాక్ట్ అయి ఘాటుగా సమాధానం ఇచ్చాడు. కొందరు ఎంతకైనా దిగజారతారని, ఇంటర్వ్యూల్లో ఏది పడితే అది వాగేస్తుంటారని మండిపడ్డాడు. దీనికి రౌతేలా స్పందించడంతో ఎందుకు అక్కా నా వెంట పడ్డావ్ అని పంత్ జవాబిచ్చాడు.
రిషబ్ పంత్ పై ఊర్వశి రౌతేలా మరోసారి నోరు పారేసుకుంది. ఈసారి పంత్ హైట్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్రోల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమె స్పందించింది. తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేయలేదని, ఓ యాడ్ ఫిల్మ్ కు సంబంధించి స్క్రిప్ట్‌లో భాగమని స్పష్టం చేసింది. సదరు వీడియోలో నటులు, వ్యాపారవేత్తలు, గాయకులు మరియు బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడుతూ “కుచ్ లోగ్ తో మేరీ హైట్ కే భీ నహీ హై” అని చెప్పింది.దీంతో ఊర్వశి పంత్ ని ఉద్దేశించి తన హైట్ గురించి కావాలనే కామెంట్స్ చేసిందని ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
చాన్నాళ్లగా తర్వాత పంత్ ఈ సీజన్ ఐపీఎల్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. గత రాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పంత్ కేవలం 32 బంతుల్లోనే 51 రన్స్ చేశాడు. కాగా నటి ఊర్వశి రౌతేలా బాలీవుడ్ తోపాటు తెలుగులోనూ నటించింది. ఆమె చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, బ్రోలాంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది.
Also Read: Kurchi MadathaPetti: కుర్చీ మడత పెట్టి సాంగ్ క్రేజ్ మాములుగా లేదుగా.. ఏకంగా అమెరికాలో?