HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Updated Wtc Points Table After Eng Vs Sl Test Series Conclusion

WTC Points Table: శ్రీలంకపై ఇంగ్లండ్ ఓట‌మి.. WTC పాయింట్ల ప‌ట్టిక‌లో మార్పులు..!

ఓడిన ఇంగ్లండ్ ఆరో స్థానంలో ఉంది. ఈ సైకిల్‌లో ఇంగ్లండ్ ఇప్పటివరకు 16 టెస్టులు ఆడింది. అందులో 8 గెలిచింది. 7 ఓడిపోయింది. 1 డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ విజయ శాతం 42.19గా ఉంది.

  • Author : Gopichand Date : 10-09-2024 - 2:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
WTC Points Table
WTC Points Table

WTC Points Table: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో, చివరి టెస్టులో శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు 2014లో తమ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత చరిత్రను పునరావృతం చేస్తూ శ్రీలంక మరోసారి వారి స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించింది. అయితే, ఈ శ్రీలంక విజయం తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా పాయింట్ల పట్టిక (WTC Points Table)లో ఏమైనా తేడా వ‌చ్చిందా..? ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక పరిస్థితి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంగ్లండ్‌పై విజయంతో శ్రీలంక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఐదవ ర్యాంక్‌లో నిలిచింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​సైకిల్‌లో శ్రీలంక ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడింది. అందులో వారు 3 గెలిచారు. 4 ఓడారు. జట్టు గెలుపు శాతం 42.86గా ఉంది. కాగా ఓడిన ఇంగ్లండ్ ఆరో స్థానంలో ఉంది. ఈ సైకిల్‌లో ఇంగ్లండ్ ఇప్పటివరకు 16 టెస్టులు ఆడింది. అందులో 8 గెలిచింది. 7 ఓడిపోయింది. 1 డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ విజయ శాతం 42.19గా ఉంది.

Also Read: Union Minister Bandi Sanjay: రైల్వే మంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ.. ఏం అడిగారంటే.?

శ్రీలంక విజయంతో భారత్‌కు లాభం..!

ఇంగ్లండ్‌పై శ్రీలంక విజయం కారణంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు ఎటువంటి నష్టాన్ని చవిచూడలేదు. అంతేకాకుండా పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్‌కు లాభం చేరింది. ఈ మ్యాచ్‌కి ముందు కూడా టీమ్ ఇండియా టేబుల్‌లో టాప్ పొజిషన్‌లో కొనసాగుతూనే ఉంది. ఈ సైకిల్‌లో భారత జట్టు ఇప్పటివరకు 9 టెస్టులు ఆడింది. ఇందులో 6 గెలిచారు. 2 ఓడిపోయారు, 1 డ్రాగా ముగిసింది. టీమ్ ఇండియా గెలుపు శాతం 68.52గా ఉంది. బంగ్లాదేశ్‌తో భారత జట్టు తదుపరి టెస్టు సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టులు జరగనున్నాయి.

పాయింట్ల పట్టికలో టాప్-5 జట్లు ఇవే

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 62.50 గెలుపు శాతంతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ 50.00 గెలుపు శాతంతో మూడో స్థానంలో, బంగ్లాదేశ్ 45.83 గెలుపు శాతంతో నాలుగో స్థానంలో, శ్రీలంక 42.86 గెలుపు శాతంతో ఐదో స్థానంలో ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • england
  • England vs Sri Lanka
  • ICC
  • ICC World Test Championship
  • IND vs BAN
  • team india
  • World Test Championship

Related News

BCCI Releases Team India 2026-27 Schedule

BCCI: టీమిండియా 2026-27 షెడ్యూల్‌ విడుదల

BCCI Releases Team India’s 2026-27 Schedule  భారత క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త అందించింది. 2026-27 సీజన్‌కు సంబంధించి టీమిండియా స్వదేశంలో ఆడనున్న అంతర్జాతీయ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది. ఈ సీజన్‌లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 17 నగరాల్లో 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున

    Latest News

    • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

    • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

    • LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

    • Sheetlaashtami Temple : శీతలాష్టమి ఆలయంలో విషాదం..తొక్కిసలాట లో 8 మంది భక్తులు మృతి

    • TVK Candidate Aadhav Arjuna : టీవీకే అభ్యర్థి ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే !!

    Trending News

      • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd