Ajinkya Rahane: 2415 గజాల స్థలాన్ని రహానేకి ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
Ajinkya Rahane: అజింక్యా రహానేకి మహారాష్ట్ర ప్రభుత్వం 2415 గజాల స్థలాన్ని లీజుకు ఇచ్చింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు .అంతకుముందు ఈ భూమిని ఇండోర్ క్రికెట్ టెస్టింగ్ సెంటర్ కోసం 1988లో సునీల్ గవాస్కర్‌కి లీజుకు ఇచ్చారు.
- Author : Praveen Aluthuru
Date : 24-09-2024 - 4:03 IST
Published By : Hashtagu Telugu Desk
Ajinkya Rahane: భారత క్రికెటర్ అజింక్యా రహానే ముంబైలో క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు. ముంబై (mumbai)లో క్రికెట్ అకాడమీని నెలకొల్పడంలో రహానేకి సహకరించిన వారికి సోషల్ మీడియాలో థాంక్స్ చెప్పాడు. ఆయనకు సహకరించిన వారిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా ఒకరు. బాంద్రా ఈస్ట్ ప్రాంతంలో అజింక్యా రహానేకి మహారాష్ట్ర (maharshtra) ప్రభుత్వం 2415 గజాల స్థలాన్ని లీజుకు ఇచ్చింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు .
అంతకుముందు ఈ భూమిని ఇండోర్ క్రికెట్ టెస్టింగ్ సెంటర్ కోసం 1988లో సునీల్ గవాస్కర్‌కి లీజుకు ఇచ్చారు. కానీ లిటిల్ మాస్టర్ ఇప్పటివరకూ అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. ఆ స్థలం అలాగే ఉండిపోయింది. దాదాపు 36 ఏళ్లుగా ఎలాంటి ఉపయోగం లేకుండా ఖాళీగా పడి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కొందరు పేదలు నివసిస్తున్నారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ని మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్లాట్ బాంద్రా రిక్లమేషన్ ప్రాంతంలో ఉంది. తన క్రికెట్ అకాడమీ యువ క్రీడాకారులకు అత్యున్నత సౌకర్యాలతో సాధికారత కల్పిస్తుందని రహానే చెప్పారు.
అజింక్య రహానే (ajinkya rahane) కంటే ముందు ఇర్ఫాన్ పఠాన్ ,యూసుఫ్ పఠాన్, ధోని, వీరేంద్ర సెహ్వాగ్ మరియు రవిచంద్రన్ అశ్విన్‌లతో సహా చాలా మంది ఆటగాళ్లు తమ సొంత క్రికెట్ అకాడమీలను నడుపుతున్నారు.కాగా రహానే ఒకప్పుడు టీమిండియాలో మూడు ఫార్మాట్‌లలో అద్భుతంగా రాణించాడు. టెస్ట్ స్పెషలిస్ట్ అయిన రహానే భారత్ తరుపున వన్డేలు, టి20 లలో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అయితే యువకుల ఎంట్రీతో రహానే ఒక్కో ఫార్మేట్ ని వదులుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం రహానే టెస్టులకే పరిమితమయ్యాడు. ఈ ఫార్మాట్‌లో కూడా విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ముంబయి రంజీ జట్టు సారథిగా కొనసాగుతున్నాడు.
Also Read: On This Day In 2007: 2007 ప్రపంచకప్ అద్భుతానికి 17 ఏళ్లు..