Covid-19: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడికి కరోనా.. రేపు జట్టులో జాయిన్?!
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వరుస ఎదురదెబ్బలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన హైదరాబాద్ జట్టుకు ఊహించని మరో షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కరోనా కల్లోలం రేపుతోంది.
- By Gopichand Published Date - 10:06 PM, Sun - 18 May 25

Covid-19: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వరుస ఎదురదెబ్బలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన హైదరాబాద్ జట్టుకు ఊహించని మరో షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కరోనా (Covid-19) కల్లోలం రేపుతోంది. ఎస్ఆర్‌హెచ్ స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఎస్ఆర్‌హెచ్ ప్రధాన కోచ్ వెట్టోరీ వెల్లడించారు.
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య 61వ మ్యాచ్ సోమవారం జరగనుంది. ఆదివారం మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్ డేనియల్ విట్టోరీ ట్రావిస్ హెడ్ గురించి ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో హెడ్ ఎంపికకు అందుబాటులో ఉండడు అని కోచ్ తెలిపారు. హెడ్‌కు కోవిడ్ సోకడంతో భారత్‌కు రావడంలో ఆలస్యం జరుగుతోందని ఆయన చెప్పారు.
హైదరాబాద్ ప్రధాన కోచ్.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌కు ఎప్పుడు, ఎక్కడ కరోనా సోకిందనే విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. హెడ్ సోమవారం భారత్‌కు చేరుకుంటారని, ఆ తర్వాత మెడికల్ టీమ్ అతని పరిస్థితిని పరిశీలిస్తుందని విట్టోరీ తెలిపారు. విట్టోరీ మాట్లాడుతూ.. “ట్రావిస్ రేపు ఉదయం వస్తున్నాడు. అతనికి కొంత ఆలస్యమైంది. అతనికి కోవిడ్ సోకింది. కాబట్టి అతను రేపు ఉదయం వచ్చి, ఆ తర్వాత మేము అతని పరిస్థితిని అంచనా వేస్తాము” అని చెప్పారు.
Also Read: Multistarrer : మల్టీస్టారర్ మూవీ చేయబోతున్న మాటల మాంత్రికుడు ..?
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వాయిదా పడిన తర్వాత ట్రావిస్ హెడ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. వారు వెళ్లిన తర్వాత తిరిగి వస్తారా లేదా అనేది తెలియలేదు. ఎందుకంటే జూన్ 11 నుంచి వీరిద్దరూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఆడాల్సి ఉంది. అయితే హెడ్, కమిన్స్ మిగిలిన మ్యాచ్‌ల కోసం జట్టులో చేరనున్నారని సన్‌రైజర్స్ హైదరాబాద్ ధృవీకరించింది. హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌ను మే 25న ఆడనుంది. దీంతో వారికి డబ్ల్యూటీసీ సన్నాహాల కోసం తగినంత సమయం లభిస్తుంది.