Multistarrer : మల్టీస్టారర్ మూవీ చేయబోతున్న మాటల మాంత్రికుడు ..?
Multistarrer : యాక్షన్ సీన్లు తక్కువగా ఉంటాయి కాబట్టి, షూటింగ్ వేగంగా పూర్తయ్యే ఛాన్సు ఉంది. గెటప్ మరియు డేట్స్ విషయంలో చరణ్ ఎలాంటి సమస్య లేకుండా సర్దుబాటు చేసుకుంటే ఈ ప్రాజెక్ట్ జరగడం ఖాయం అంటున్నారు
- By Sudheer Published Date - 09:40 PM, Sun - 18 May 25

త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram ) తాజా ప్రాజెక్ట్ విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అల్లు అర్జున్‌తో చేయాల్సిన సినిమా ఆలస్యమవ్వడంతో త్రివిక్రమ్, వెంకటేష్(Venkatesh)తో సినిమా మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ కాంబినేషన్ దాదాపు ఫైనల్ అయిందని సినీ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ సింగిల్ హీరో సినిమా కాకపోవచ్చని టాక్. మల్టీ స్టారర్(Multistarrer )గా ఈ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నారని, ఇందులో రామ్ చరణ్ కూడా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Anirudh : దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఇతడే !!
ఇప్పటికే రామ్ చరణ్ (Ram Charan ) – త్రివిక్రమ్ కాంబోపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ నిలదొక్కుకోలేదు. ప్రస్తుతం చరణ్ ‘పెద్ది’ (Peddi) చిత్రంతో బిజీగా ఉన్నా, త్రివిక్రమ్ కథ నచ్చితే తక్షణమే డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది పూర్తిగా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమని సమాచారం. యాక్షన్ సీన్లు తక్కువగా ఉంటాయి కాబట్టి, షూటింగ్ వేగంగా పూర్తయ్యే ఛాన్సు ఉంది. గెటప్ మరియు డేట్స్ విషయంలో చరణ్ ఎలాంటి సమస్య లేకుండా సర్దుబాటు చేసుకుంటే ఈ ప్రాజెక్ట్ జరగడం ఖాయం అంటున్నారు.
అయితే ఈ సినిమాను సంక్రాంతి 2026లో విడుదల చేయాలన్నది త్రివిక్రమ్ ప్లాన్. కానీ అదే టైమ్‌లో చిరంజీవి సినిమా ఉండే అవకాశాలున్నాయి. దీంతో చరణ్ నటించిన సినిమా అదే బరిలోకి దిగడం అనవసర పోటీగా మారొచ్చు. అందుకే ఈ సినిమా వేసవిలో విడుదల చేసేందుకు అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.