HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Travelers Stunned As Virat Kohli Boards Domestic Flight

Virat Kohli: విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో వైరల్.. సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా..!

భారత క్రికెట్‌ జట్టు వెటరన్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) ఇటీవల వన్డేల్లో 49వ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.

  • Author : Gopi Date : 07-11-2023 - 3:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli Record
Virat Kohli Record

Virat Kohli: భారత క్రికెట్‌ జట్టు వెటరన్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) ఇటీవల వన్డేల్లో 49వ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్‌ను కోహ్లీ సమం చేశాడు. కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అతను దేశీయ విమానంలో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. కోహ్లీ ఈ సింప్లిసిటీని అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను చాలా సోషల్ మీడియా ఖాతాలలో షేర్ అయ్యాయి.

కోహ్లికి సంబంధించిన వీడియో X (ట్విట్టర్)లో షేర్ చేయబడింది. ఇందులో అతను విమానంలో కూర్చున్నట్లు కనిపిస్తున్నాడు. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వన్ ఇండియా న్యూస్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక వార్త ప్రకారం.. భారత్ తదుపరి మ్యాచ్ కోసం కోహ్లీ బెంగళూరు చేరుకున్నాడు. బెంగుళూరు వెళ్లేందుకు డొమెస్టిక్ ఫ్లైట్ ఉపయోగించాడు. నవంబర్ 12న బెంగళూరు వేదికగా భారత్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

Also Read: Angelo Mathews : టైమ్డ్ ఔట్ వివాదం.. ఐసీసీకి మాథ్యూస్ ఫిర్యాదు

mindfckkk! What a day 🥵❤️#ViratKohli pic.twitter.com/Pw3ldnJGZ5

— ASHRiTH (@AshrithNTR) November 6, 2023

నవంబర్ 12న బెంగళూరులో జరిగే భారత్, నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్ 2023 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు ముందు జరిగే చివరి మ్యాచ్. దీని తర్వాత నవంబర్ 15, 16 తేదీల్లో మొదటి, రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

We’re now on WhatsApp : Click to Join

విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే.. దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లి 121 బంతులు ఎదుర్కొని 101 పరుగులు చేశాడు. అతని వన్డే కెరీర్‌లో ఇది 49వ సెంచరీ. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా సచిన్ రికార్డు సృష్టించాడు. కోహ్లీ.. సచిన్ రికార్డును సమం చేశాడు. కోహ్లీ ఇప్పటివరకు 289 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 49 సెంచరీలు, 70 అర్ధ సెంచరీలు చేశాడు. ఈ సమయంలో కోహ్లి అత్యుత్తమ స్కోరు 183 పరుగులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangalore
  • Domestic Flight
  • ICC World Cup 2023
  • virat kohli
  • world cup 2023

Related News

Former Punjab Kings Pacer Amanpreet Singh Gill Rest in Peace

Amanpreet Singh: కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కన్నుమూత

భారత క్రికెట్ రంగంలో విషాదం చోటుచేసుకుంది. భారత మాజీ అండర్-19, పంజాబ్ మీడియం పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (36) బుధవారం చండీగఢ్‌లో మృతి చెందారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఒకప్పుడు విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 జట్టులో ఆడిన అమన్‌ప్రీత్ హఠాన్మరణం క్రీడా వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అమన్‌ప్రీత్ సింగ్ గిల్ పంజాబ్ తరఫున ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 11 విక

    Latest News

    • Vijay Joseph: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

    • Trisha: విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..

    • Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

    • CM VIJAY దళపతి ప్రమాణ స్వీకారం

    • TVK విజయ్‌ అను నేను..

    Trending News

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

      • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd