KKR vs SRH Qualifier 1: ఆ ఐదుగురితో జాగ్రత్త..తొలి క్వాలిఫయర్‌లో విధ్వంసమే
లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్లు టాప్ 4 లో ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ రోజు తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లీగ్ దశలో కేకేఆర్ 14 మ్యాచ్‌లలో 9 గెలిచి 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
- By Praveen Aluthuru Published Date - 03:07 PM, Tue - 21 May 24

KKR vs SRH Qualifier 1: లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్లు టాప్ 4 లో ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ రోజు తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లీగ్ దశలో కేకేఆర్ 14 మ్యాచ్‌లలో 9 గెలిచి 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్‌ల్లో 8 గెలిచి 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కేకేఆర్ . సన్ రైజర్స్ మధ్య ఈ సీజన్‌లో ఒకే ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఆ పోరులో కేకేఆర్ ను హర్షిత్ రాణా గెలిపించాడు.అయితే కేకేఆర్, సన్ రైజర్స్ ఇరు జట్లు కూడా బ్యాటింగ్ లో బలంగా ఉన్నాయి. బౌలింగ్ లో మాత్రం కేకేఆర్ దే పై చేయి. నరైన్, వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్ లో ఉన్నారు. తొలి క్వాలిఫయర్ లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు రెండో క్వాలిఫయర్ ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగిస్తే.. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా ఆడాలి కానీ.. ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా జరగకపోతే సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తెలుస్తరు. సూపర్ ఓవర్ కూడా జరగని పరిస్థితి ఏర్పడితే పాయింట్ల ఆధారంగా విజేతని నిర్ణయిస్తారు.
కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ తిరిగి ఇంగ్లాండ్‌కు వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితిలో రహ్మానుల్లా గుర్బాజ్ ను ఓపెనర్ గా ఆడించే అవకాశం ఉంది. గుర్బాజ్ కు తోడుగా సునీల్ నరైన్ మరో ఎండ్ లో ఉంటాడు. శ్రేయాస్ అయ్యర్ 3వ స్థానంలో, నితీష్ రానా 4వ స్థానంలో, వెంకటేష్ అయ్యర్ 5వ స్థానంలో, ఆండ్రీ రస్సెల్ 6వ స్థానంలో, రింకూ సింగ్ 7వ స్థానంలో, రమణదీప్ సింగ్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతను హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్ తీసుకుంటారు. స్పిన్ విభాగాన్ని వరుణ్ చక్రవర్తి చూసుకుంటాడు.అయితే ఈ కీలక మ్యాచ్ లో అందరిచూపు ఆ ఐదుగురు ఆటగాళ్లపైనే ఉంది.
ఈ సీజన్ ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగాడు. ప్రస్తుత సీజన్‌లో అభిషేక్ శర్మ మొత్తం 13 మ్యాచ్‌ల్లో 467 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ పేరు ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. అతను ప్రస్తుత సీజన్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు ఆడి 461 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ మరియు మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.నరైన్ స్టాండ్ ఇస్తే ఆ విధ్వంసం బౌలర్లకు బాగా తెలిసే ఉంటుంది. ఇక ప్రస్తుత సీజన్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన ట్రావిస్ హెడ్ పేరు జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ట్రావిస్ హెడ్ 12 మ్యాచ్‌ల్లో 533 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ మరియు 4 అర్ధ సెంచరీలు నెలకొల్పాడు. ప్రస్తుత సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి మొత్తం 15 వికెట్లు తీసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 9.23.ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. 13 మ్యాచ్‌ల్లో మొత్తం 18 వికెట్లు తీసిన కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఐదవ స్థానంలో ఉన్నాడు. 8.34.ఎకానమీ రేటుతో చక్రవర్తి అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో పిచ్ కీలకం కానుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో బ్యాటర్లు రెచ్చిపోవడం ఖాయం. ఈ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంగా పరిగణించబడుతుంది. అయితే ఈ పిచ్ పై స్పిన్నర్లు బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. ఆట సాగుతున్న కొద్దీ ఫాస్ట్ బౌలర్‌లకు పిచ్ అనుకూలంగా మారుతుంది. ఈ క్రమంలో బ్యాటర్లు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి తొలి పది ఓవర్లలో వీలైనన్ని పరుగులు రాబట్టాల్సి ఉంది.
Also Read: Sudheer Babu Haromhara Postponed : బాధగా ఉన్నా తప్పలేదు అంటున్న సుధీర్ బాబు.. ఇంతకీ ఏమైంది అంటే..?