Ind vs Aus 3rd Test: కష్టాల్లో టీమిండియా.. 45 పరుగులకే ఐదు వికెట్లు
ఆస్ట్రేలియా (Australia) తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా (India) తడబడుతోంది. కేవలం 45 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ 12 పరుగులకే కుహ్నెమాన్ బౌలింగ్ లో ఔట్ కాగా, అతడి బౌలింగ్ లోనే గిల్ కుడా 21 పరుగులు చేసి ఔటయ్యాడు.
- By Gopichand Published Date - 10:54 AM, Wed - 1 March 23

ఆస్ట్రేలియా (Australia) తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా (India) తడబడుతోంది. కేవలం 45 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ 12 పరుగులకే కుహ్నెమాన్ బౌలింగ్ లో ఔట్ కాగా, అతడి బౌలింగ్ లోనే గిల్ కుడా 21 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక పుజారా కేవలం ఒకే పరుగు చేసి లియాన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. జడేజాను లియాన్ ఔట్ చేయగా, శ్రేయస్ ను కుహ్నెమాన్ ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ, శ్రీకర్ ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది.
Also Read: Employees Strike: సమ్మెలో 5 లక్షల మంది ఉద్యోగులు.. ఎక్కడంటే..?
ఇండియా- ఆస్ట్రేలియా మధ్య నేడు మూడో టెస్టు ఇండోర్ వేదికగా ప్రారంభమైంది. దీంట్లో భాగంగా ఇండియా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా మూడో టెస్టులోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ విక్టరీతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధిస్తుంది.