HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Tale Of Two Yadavs As India Save Series With 106 Run Win

India Win: అదరగొట్టిన సూర్య, కుల్దీప్.. మూడో టీ ట్వంటీ మనదే, సిరీస్ సమం..!

టీమిండియా మూడో టీ ట్వంటీలో 106 పరుగుల తేడాతో విజయం (India Win) సాధించింది. తద్వారా సిరీస్ ను 1-1 తో సమంగా ముగించింది.

  • Author : Gopichand Date : 15-12-2023 - 6:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Win
Suryakumar Imresizer (1)

India Win: సౌతాఫ్రికా టూర్ లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. సిరీస్ చేజారిపోయే ప్రమాదం పొంచి ఉన్న వేళ అదరగొట్టిన టీమిండియా మూడో టీ ట్వంటీలో 106 పరుగుల తేడాతో విజయం (India Win) సాధించింది. తద్వారా సిరీస్ ను 1-1 తో సమంగా ముగించింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. 29 పరుగులకే గిల్ , తిలక్ వర్మ వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో యశస్వి జైశ్వాల్ , సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నారు. పవర్ ప్లేలో 62 పరుగులు చేసిన వీరిద్దరూ తర్వాత మరింత ధాటిగా ఆడారు. జైస్వాల్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. సూర్య 32 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 112 పరుగులు జోడించారు. జైశ్వాల్ 60 పరుగులకు ఔటవగా..,,తర్వాత క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ సాయంతో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ట్రేడ్ మార్క్ సిక్స్‌లతో అభిమానులను అలరించాడు. సూర్య 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో సూర్యకు ఇది నాలుగో శతకం. సూర్యకుమార్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరికి భారత్ 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్, లిజాడ్ విలియమ్స్ రెండేసి వికెట్లు తీయగా.. నాండ్రె బర్గర్, టబ్రైజ్ షంసీ తలో వికెట్ పడగొట్టారు.

Also Read: Karthikeya : విజయ్‌ దేవరకొండ చేయాల్సిన సినిమా.. కార్తికేయ అందుకొని హిట్..

భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేసారు. వరుస వికెట్లు తీస్తూ పైచేయి సాధించారు. టాపార్డర్ లో మక్రమ్ తప్పిస్తే మిగిలిన వారంతా చేతులెత్తేశారు. స్పిన్నర్ల ఎంట్రీతో సౌతాఫ్రికా మరింత వేగంగా వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ తన మ్యాజిక్ చూపించాడు. వరుస వికెట్లు పడుతున్నా డేవిడ్ మిల్లర్ ధాటిగా ఆడి కాసేపు అలరించాడు. అయితే మరో ఎండ్ లో మిగిలిన బ్యాటర్లను కుల్దీప్ యాదవ్ కుదురుకోనివ్వలేదు. మిల్లర్ 35 పరుగులకు ఔటవగా… సౌతాఫ్రికా ఇన్నింగ్స్ కు 95 పరుగులకే తెరపడింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కేవలం 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. జడేజా 2 వికెట్లు , అర్షదీప్ సింగ్ , ముఖేశ్ కుమార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో టీ ట్వంటీ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దవగా… రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిచింది. కాగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం నుంచి మొదలుకానుంది.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ind vs sa
  • India vs south africa
  • india win
  • kuldeep yadav
  • Suryakumar Yadav
  • yashasvi jaiswal

Related News

Kuldeep Yadav Marriage

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న టీమ్ ఇండియా ప్లేయర్..

Kuldeep Yadav Wedding  భారత క్రికెట్ అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందాయి. ఒకటి టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించడం కాగా, రెండోది జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లి పీటలెక్కనుండటం. ఈ రెండు వార్తలతో దేశవ్యాప్తంగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగి

  • India Prize Money After Winning T20 World Cup 2026

    టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్

  • Suryakumar Yadav

    టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Suryakumar Yadav

    Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్

  • Hanuman Temple

    హనుమాన్ ఆలయంలో ట్రోఫీకి పూజలు చేయించిన గంభీర్, సూర్య

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd