టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరాలంటే?!
భారత్ టాప్-2లో నిలవాలంటే జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారీ విజయాలు నమోదు చేయాలి. అలాగే గ్రూప్‌లోని ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.
- Author : Gopichand
Date : 24-02-2026 - 5:59 IST
Published By : Hashtagu Telugu Desk
India Semifinal: ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో వెస్టిండీస్ జట్టు జింబాబ్వేను 107 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. వెస్టిండీస్ సాధించిన ఈ ఘనవిజయం టీమిండియా ఆశలపై నీళ్లు చల్లడమే కాకుండా సెమీఫైనల్ సమీకరణాలను మరింత క్లిష్టతరం చేసింది.
పాయింట్ల పట్టికలో మార్పులు
ఈ భారీ విజయంతో వెస్టిండీస్ నెట్ రన్ రేట్ (NRR) ఏకంగా +5.350 కి చేరుకుంది. దీనివల్ల అప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న సౌతాఫ్రికా రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ ఇంకా ఖాతా తెరవలేదు. సౌతాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో భారత జట్టు రన్ రేట్ -3.800 కు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినప్పటికీ సెమీఫైనల్ బెర్త్ ఖాయమని చెప్పలేని పరిస్థితి నెలకొంది.
Also Read: సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
భారత్ ముందున్న సవాళ్లు
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా తన రెండో సూపర్-8 మ్యాచ్‌ను గురువారం, ఫిబ్రవరి 26న జింబాబ్వేతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కేవలం గెలవడమే కాకుండా నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడం భారత్‌కు అత్యవసరం. భారత్ తన నెగటివ్ రన్ రేట్‌ను పాజిటివ్‌లోకి మార్చుకోవాలంటే జింబాబ్వేపై కనీసం 77 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఇది జరిగితేనే రన్ రేట్ సున్నా కంటే పైకి వస్తుంది. ఒకవేళ భారత్ మొదట బౌలింగ్ చేసి లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే సమీకరణం మరింత కఠినంగా మారుతుంది. తక్కువ ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.
సెమీఫైనల్ చేరాలంటే ఏం చేయాలి?
భారత్ టాప్-2లో నిలవాలంటే జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారీ విజయాలు నమోదు చేయాలి. అలాగే గ్రూప్‌లోని ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా వెస్టిండీస్ తన తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని లేదా భారత్ వారిపై భారీ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ ఉన్న ఫామ్ చూస్తుంటే వారిని దాటి ముందుకు వెళ్లడం భారత జట్టుకు అగ్నిపరీక్షే అని చెప్పాలి.