బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!
భారత్‌తో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ మాట్లాడారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు అతిపెద్ద సవాలు వరుణ్ చక్రవర్తి అని ఆయన పేర్కొన్నారు.
- Author : Gopichand
Date : 22-02-2026 - 2:45 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs SA: భారత్- సౌతాఫ్రికా మధ్య జరగనున్న సూపర్ 8 మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ స్టేజ్‌లో రెండు జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. ఇప్పుడు సూపర్ 8 దశను ఇరు జట్లు విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రా సొంత గడ్డ అయిన అహ్మదాబాద్‌లో జరుగుతోంది. ఈ మైదానంలో బుమ్రాకు మంచి రికార్డు ఉంది. కానీ దక్షిణాఫ్రికా జట్టుకు మాత్రం మరో భారత ఆటగాడు నిద్ర లేకుండా చేస్తున్నాడు. క్వింటన్ డి కాక్ ఆ బౌలర్ పేరును వెల్లడించాడు.
వరుణ్ చక్రవర్తిపై డి కాక్ ప్రశంసలు
భారత్‌తో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ మాట్లాడారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు అతిపెద్ద సవాలు వరుణ్ చక్రవర్తి అని ఆయన పేర్కొన్నారు. చక్రవర్తిపై తమ ప్లాన్స్ విఫలమయ్యే అవకాశం కూడా ఉందని ఆయన అంగీకరించారు.
Also Read: కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్
“ప్రతి ఒక్కరి ఆట తీరు వేరుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. చివరికి మా బలానికి కట్టుబడి సరైన సమయంలో రాణించాల్సి ఉంటుంది. వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. దాదాపు రెండు నెలల క్రితం జరిగిన సిరీస్‌లో కూడా మాపై అద్భుతంగా బౌలింగ్ చేశారు.” అని డి కాక్ అన్నారు.
ఆయన ఇంకా కొనసాగిస్తూ.. “సిరీస్ తర్వాత అతడిని ఎలా ఎదుర్కోవాలో మా ఆటగాళ్లు చర్చించుకుని ఉంటారని ఆశిస్తున్నాను. మా ప్రణాళికలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మా ప్లాన్ ఫెయిల్ అయితే, దానికి ఒక కారణం ఉంటుంది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ప్రపంచంలోనే నంబర్ 1 స్పిన్నర్. అందుకే మేము ఏమి చేయగలమో వేచి చూడాలి” అని తెలిపారు.
అహ్మదాబాద్‌లో వరుణ్ చక్రవర్తి రికార్డు
అహ్మదాబాద్ పిచ్‌పై వరుణ్ చక్రవర్తి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మైదానంలో ఆయన ఇప్పటివరకు కేవలం రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడినప్పటికీ మొత్తం 7 వికెట్లు పడగొట్టారు.
- బౌలింగ్ సగటు: కేవలం 9.57
- మైదానం: నరేంద్ర మోదీ స్టేడియం
ఈ గణాంకాలను బట్టి నరేంద్ర మోదీ స్టేడియంలో ఆయన ఎంత ప్రమాదకరంగా మారతారో అర్థం చేసుకోవచ్చు. అందుకే దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆయనను చూసి భయపడుతున్నారు.