Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సరికొత్త రికార్డు!
ఈ జాబితాలో విరాట్ కోహ్లి (30 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (28 సిక్సర్లు), యువరాజ్ సింగ్ (26 సిక్సర్లు) వంటి దిగ్గజాలు ఉన్నారు. వీరందరినీ దాటి సూర్య అగ్రస్థానాన్ని దక్కించుకోవడం అతని బ్యాటింగ్‌లోని మెరుపును స్పష్టం చేస్తుంది.
- By Gopichand Published Date - 05:55 PM, Fri - 7 November 25
Suryakumar Yadav: భారత్- ఆస్ట్రేలియా మధ్య ఉత్కంఠభరితంగా సాగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన దూకుడు ఆటతో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. నవంబర్ 6న జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌లో సూర్య బాదిన రెండు భారీ సిక్సర్లు అతడిని ‘సేన’ దేశాలపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ ఆటగాడిగా నిలబెట్టాయి.
రోహిత్ శర్మ రికార్డు బద్దలు
దక్షిణాఫ్రికా (SA), ఇంగ్లాండ్ (E), న్యూజిలాండ్ (NZ), మయు ఆస్ట్రేలియా (A) దేశాలను సంయుక్తంగా ‘సేన’ దేశాలుగా క్రికెట్ పరిభాషలో వ్యవహరిస్తారు. ఈ బలమైన జట్లపై టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత రికార్డును సూర్యకుమార్ యాదవ్ తన ఖాతాలో వేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ దేశాలపై ఇప్పటివరకు 43 సిక్సర్లు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అంతకుముందు 41 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్న భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఆయన అధిగమించడం విశేషం. మిస్టర్ 360గా పేరుగాంచిన సూర్య.. తన విభిన్నమైన షాట్లతో మైదానంలో అన్ని వైపులా సిక్సర్లు కొట్టగల సామర్థ్యాన్ని ఈ రికార్డుతో మరోసారి రుజువు చేసుకున్నాడు.
Also Read: Minister Uttam: అభివృద్ధి, సంక్షేమం కోసం నవీన్ యాదవ్‌కు మద్దతు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్
ఈ జాబితాలో విరాట్ కోహ్లి (30 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (28 సిక్సర్లు), యువరాజ్ సింగ్ (26 సిక్సర్లు) వంటి దిగ్గజాలు ఉన్నారు. వీరందరినీ దాటి సూర్య అగ్రస్థానాన్ని దక్కించుకోవడం అతని బ్యాటింగ్‌లోని మెరుపును స్పష్టం చేస్తుంది.
తుది పోరుకు రంగం సిద్ధం
భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో చివరిదైన ఐదవ మ్యాచ్ నవంబర్ 8న బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్న సూర్యకుమార్ యాదవ్.. తుది పోరులో మరిన్ని సిక్సర్లతో ఈ రికార్డును మరింత పెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతని ఆటతీరు భారత అభిమానులకు ఆనందాన్ని పంచుతూ.. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.