PBKS vs SRH: 2 పరుగుల తేడాతో పంజాబ్ ను ఓడించిన సన్‌రైజర్స్
ఐపీఎల్ 23వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. హైదరాబాద్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది.
- Author : Praveen Aluthuru
Date : 09-04-2024 - 11:55 IST
Published By : Hashtagu Telugu Desk
PBKS vs SRH: ఐపీఎల్ 23వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. హైదరాబాద్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ తరుపున చివరి ఓవర్లలో శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు తుఫాను బ్యాటింగ్ చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. శశాంక్ 25 బంతుల్లో 46 పరుగులు చేయగా, అశుతోష్ 15 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సామ్ కుర్రాన్ 29 పరుగులు చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున యువ బ్యాట్స్‌మెన్ నితీష్ రెడ్డి 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 64 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే హైదరాబాద్ తరుపున నితీష్ రెడ్డి మినహా ఎవరూ ప్రత్యేకంగా రాణించలేకపోయారు. కాగా పంజాబ్ కింగ్స్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో మొత్తం నాలుగు వికెట్లు తీయగా, శామ్ కుర్రాన్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ సీజన్‌లో హైదరాబాద్ మూడో విజయాన్ని అందుకుంది.
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (సి), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్.
Also Read: BRS Party: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచేనా.. పండితులు ఏం చెప్పారంటే!