Kohli – Sand Sculpture : విరాట్ కోహ్లీ బర్త్‌డే స్పెషల్.. జీవకళతో ఇసుక శిల్పం
Kohli - Sand Sculpture : ఇవాళ భారత క్రికెటర్ విరాట్ కోహ్లి 35వ పుట్టినరోజు.
- By Pasha Published Date - 01:09 PM, Sun - 5 November 23

Kohli – Sand Sculpture : ఇవాళ భారత క్రికెటర్ విరాట్ కోహ్లి 35వ పుట్టినరోజు. ఈసందర్భంగా ఇసుకతో కోహ్లి సైకత శిల్పాన్ని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించారు. ఈ సైకత శిల్పానికి ఒడిశాలోని పూరీ సముద్ర తీరం వేదికగా నిలిచింది. ముందు కోహ్లి బొమ్మ.. దాని వెనుక ఈడెన్ గార్డెన్ స్టేడియం.. వీటి చుట్టూ పచ్చటి మైదానం కలయికగా చిత్రించిన ఈ సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా ఈడెన్ గార్డెన్ స్టేడియం మోడల్‌ను డిజైన్ చేసేందుకు పట్నాయక్ 35 ఇసుక బ్యాట్‌లను తయారు చేశారు. ఇసుకతో తయారు చేసిన క్రికెట్ బాల్స్‌ను కూడా ఇందులో చేర్చడంతో జీవకళ ఉట్టిపడుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
Wishing @imVkohli a very very happy birthday & many more successful years with heaps of runs coming off his bat!
My SandArt at Puri beach in Odisha.#HappyBirthdayViratKohli pic.twitter.com/439ofckLYz— Sudarsan Pattnaik (@sudarsansand) November 5, 2023
ఈ సైకత శిల్పం తయారీకి దాదాపు 5 టన్నుల ఇసుకను వాడానని సుదర్శన్ పట్నాయక్ చెప్పారు. ఈక్రమంలో పట్నాయక్‌కు చెందిన సాండ్ ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు ఆయనకు సహకరించారు. ఈ సైకత శిల్పం ఫొటోతో సుదర్శన్ ఒక ట్వీట్ చేశారు. కోహ్లి తన బ్యాట్‌తో భారత టీమ్ కోసం మరిన్ని పరుగులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కోహ్లికి బర్త్ డే విషెస్(Kohli – Sand Sculpture) చెప్పారు.