Model Tania Suicide: మోడల్ తానియా సూసైడ్ కేసులో SRH స్టార్ ఆటగాడు
మోడల్ తానియా సింగ్ గత అర్థరాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. తానియా దాదాపు రెండేళ్లుగా ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ చదువుతోంది. తానియా ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
- Author : Praveen Aluthuru
Date : 21-02-2024 - 2:42 IST
Published By : Hashtagu Telugu Desk
Model Tania Suicide: మోడల్ తానియా సింగ్ గత అర్థరాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. తానియా దాదాపు రెండేళ్లుగా ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్ చదువుతోంది. తానియా ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. విచారణలో భాగంగా తానియా ఫోన్‌ను తనిఖీచేయగా ఆమె ఫోన్ నుండి చివరి కాల్ అభిషేక్ శర్మకు వెళ్ళినట్లు గుర్తించారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు అభిషేక్ శర్మ ఆత్మహత్య కేసులో ఇరుక్కున్నాడు. సూరత్‌కు చెందిన ప్రముఖ మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ కోసం సమన్లు పంపారు . తానియా చివరి కాల్ అభిషేక్ శర్మకు వెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.నివేదికల ప్రకారం తానియా కాల్ వివరాలలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇది కాకుండా ఆమె చివరి కాల్ కూడా అభిషేక్ శర్మకు అని వెలుగులోకి వస్తోంది. దీని ఆధారంగా అభిషేక్ శర్మను పోలీసులు విచారణకు పిలిచారు. ఇదే సమయంలో పోలీసులు ఇతర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం తానియా ప్రేమ వ్యవహారమే ఆత్మహత్య కాదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్ లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో 47 మ్యాచ్‌లు ఆడి 137.38 స్ట్రైక్ రేట్‌తో 893 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 75 పరుగులు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 4 అర్ధ సెంచరీలు, 9 వికెట్లు తీశాడు.
Also Read: Anil Kumar Yadav : తల తెగినా సరే జగనన్న కోసం ముందుకెళ్తా