Anil Kumar Yadav : తల తెగినా సరే జగనన్న కోసం ముందుకెళ్తా
- Author : Kavya Krishna
Date : 21-02-2024 - 2:35 IST
Published By : Hashtagu Telugu Desk
తల తెగుతుందన్నా సరే.. జగనన్న కోసం ముందుకెళ్లి నిలబడతానే తప్ప వెనకడుగు వేయనని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) అన్నారు. జగన్ (YS Jagan) కోసం రామబంటులా పని చేస్తానని చెప్పారు. నరసరావుపేట ఎంపీగా గెలిచాక ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. పల్నాడు గడ్డ ప్రజలు తనను అక్కున చేర్చుకోవడంతో నెల్లూరు వదిలి. వచ్చినపుడు కలిగిన బాధ పోయిందన్నారు. జగన్ ఒక్కడిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని విమర్శించారు. ఎంత మంది వచ్చినా జగన్‌ను ఓడించలేరని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు దేశం మొత్తం సోనియాగాంధీని చూసి భయపడితే.. ఆమెను భయపెట్టింది జగన్ అని.. జగన్‌ను తిట్టే దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు ఏపీలో పుట్టలేదని అన్నారు. నవ్వుతూ ప్రశాంతంగా ఉంటాడు, ఏమీ చేయలేడనుకుంటున్నారెమోనని.. కానీ.. ముఖ్యమంత్రి అయ్యి దేశంలో ఎంతో మందిని కలవరపెట్టిన వ్యక్తి జగన్. జగన్‌ను టార్గెట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 2024లో జగన్ ఒక్కడే వారందరినీ ఓడించి హైదరాబాద్‌కు పంపిస్తాడన్నారు. 2024లో కూడా పవన్ ఓటమి ఖాయమని, ఏపీలో తమ గెలుపును ఎవరూ ఆపలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘పవన్ ఫ్యాన్స్ పవన్ ని చీల్చి చెండాడుతున్నారు.. పవన్ ఫ్యూచర్ ఏంటో అర్థం కావడం లేదు.. ఏం హామీ ఇస్తాడో.. అభిమానం పేరుతో యువకుల జీవితాలను నాశనం చేస్తున్నాడు’ అని ఆరోపించారు. అనిల్ కుమార్ యాదవ్‌ను నరసరావు పేట ఎంపీ అభ్యర్థిగా అధికార వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానం నియమించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిలను నియమించే ప్రక్షాళనలో భాగంగా ఎమ్మెల్యే అనిల్ యాదవ్‌ను పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా కొద్ది వారాల క్రితం ఖరారు చేసింది వైసీపీ. తాజాగా వినుకొండలో ఏర్పాటు చేసిన సభలో అనిల్ కుమార్ మాట్లాడుతూ.. పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లి అందర్నీ వ్యక్తిగతంగా కలుస్తానని అన్నారు.
Read Also : TDP: టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు రాజీనామా