HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >South Africa Bowlers Power Proteas Into T20 Wc Final

South Africa: సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ ఓటమి.. తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికా..!

  • Author : Gopichand Date : 27-06-2024 - 9:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
South Africa
South Africa

South Africa: టోర్నీ ఆరంభం నుంచీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటూ సెమీఫైనల్ చేరిన ఆఫ్ఘనిస్తాన్ పోరాటానికి తెరపడింది. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) 9 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసింది. సూపర్ 8 వరకూ దాదాపు అన్ని మ్యాచ్ లలో గట్టిపోటీనిచ్చిన ఆఫ్ఘన్లు కీలక మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేశారు. సఫారీ బౌలింగ్ ధాటికి క్రీజులో నిలవలేకపోయారు. సఫారీ పేసర్ల దెబ్బకు కేవలం 56 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ కుప్పకూలింది. స్పిన్నర్లతో మరోసారి విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పిచ్ పేసర్లకు చక్కగా సహకరించడంతో సఫారీ బౌలర్లు చెలరేగిపోయారు. సౌతాఫ్రికా పేస్ త్రయం మార్కో జెన్సన్, రబాడ , నోర్జే ధాటికి ఆఫ్ఘన్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. పవర్ ప్లేలో ఆఫ్ఘనిస్తాన్ 28 పరుగులే చేసి 6 వికెట్లు చేజార్చుకుంది.

Also Read: Russia Train Accident : ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన తొమ్మిది బోగీలు

ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కేవలం ఒకే ఒక్క బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ సాధించగా… మిగిలిన వారంతా సింగ్ డిజిట్ కే ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ కు 11.5 ఓవర్లలోనే తెరపడింది. సఫారీ బౌలర్లలో జెన్సన్ 3 , షంషి 3, రబాడ 2, నోర్జే 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత ఛేజింగ్ లో సౌతాఫ్రికా 5 పరుగులకే డికాక్ వికెట్ కోల్పోయినప్పటకీ హెండ్రిక్స్, మార్క్ రమ్ ధాటిగా ఆడి జట్టు విజయాన్ని పూర్తి చేశారు. సఫారీ టీమ్ 8.5 ఓవర్లలో టార్గెట్ ఛేదించగా.. హెండ్రిక్స్ 29 , మార్క్ రమ్ 23 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఈ విజయంతో సౌతాఫ్రికా తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 T20 World Cup
  • ICC Men T20 World Cup
  • ICC T20 World Cup 2024
  • SA Into Final
  • SA vs AFG
  • south africa

Related News

Sunil Gavaskar

సెమీస్ ముందు ఇండియాకు గ‌వాస్క‌ర్ వార్నింగ్

Sunil Gavaskar  టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఎల్లుండి ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగుతుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. అయితే, జస్‌ప్రీత్ బుమ్రా వంటి అద్భుతమైన బౌలర్ ఉండటం, బ్యాటింగ్ ఆర్డర్‌లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ కారణంగా ఆతిథ్య టీమిండియాకే స్వల్పంగా గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్

  • Semi Final Matches

    టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

  • Team India

    టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

Latest News

  • Blenders Pride : బ్లెండర్స్ ప్రైడ్ నుండి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్

  • Escorts Kubota Limited : దక్షిణాది రైతుల కోసం ఎస్కార్ట్స్ కుబోటా సరికొత్త ట్రాక్టర్ విడుదల

  • సోషల్ మీడియా క్రియేటర్ల శ్రమను దోచుకుంటున్నారు: విజయసాయిరెడ్డి

  • Mini Maldives : తెలంగాణలో మినీ మాల్దీవులు ఉన్నాయని మీకు తెలుసా ?

  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలి.. చైనా వార్నింగ్ !

Trending News

    • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

    • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

    • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

    • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd