All Out For 6 Runs: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డు.. ఆరు పరుగులకే ఆలౌట్
క్రికెట్ (Cricket) చరిత్రలోనే చెత్త రికార్డు. విజయ్ మర్చంట్ ట్రోఫీ కింద అండర్ -16 స్థాయిలో నిర్వహించిన మ్యాచ్ లో ఈ చెత్త రికార్డు నమోదు కావడం గమనార్హం. ఎనిమిది మంది బ్యాటర్లు డగౌట్‌కు వెళ్లి తమ జట్టును నిరుత్సాహపరిచారు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా సిక్కిం, మధ్యప్రదేశ్ జట్ల మధ్య పోటీ జరిగింది. సిక్కిం జట్టు కేవలం 6 పరుగులకే ఔటైంది.
- By Gopichand Published Date - 09:41 AM, Sat - 24 December 22

క్రికెట్ (Cricket) చరిత్రలోనే చెత్త రికార్డు. విజయ్ మర్చంట్ ట్రోఫీ కింద అండర్ -16 స్థాయిలో నిర్వహించిన మ్యాచ్ లో ఈ చెత్త రికార్డు నమోదు కావడం గమనార్హం. ఎనిమిది మంది బ్యాటర్లు డగౌట్‌కు వెళ్లి తమ జట్టును నిరుత్సాహపరిచారు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా సిక్కిం, మధ్యప్రదేశ్ జట్ల మధ్య పోటీ జరిగింది. సిక్కిం జట్టు కేవలం 6 పరుగులకే ఔటైంది. సిక్కిం జట్టు ఫాలో-ఆన్ ఆడి ఆరు పరుగులకే ఆలౌటైంది. మధ్యప్రదేశ్ బౌలర్ల ధాటికి సిక్కిం బ్యాట్స్‌మెన్ ఎనిమిది మంది ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు.
అవనీష్ 4 పరుగులు, అక్షద్ 2 పరుగులు చేశారు. దీంతో మధ్యప్రదేశ్ జట్టు సిక్కింపై 365 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిక్కిం జట్టు కేవలం 9.3 ఓవర్లు మాత్రమే ఆడింది. విజయ్ మర్చంట్ ట్రోఫీలో బాగంగా U-16 స్థాయిలో మధ్యప్రదేశ్, సిక్కిం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 414/8 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సిక్కిం తొలి ఇన్నింగ్స్‌లో 43 రన్స్, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులకే కుప్పకూలింది. దీంతో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 365 రన్స్ తేడాతో గెలుపొందింది. సిక్సిం తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులు కలిపి 49 పరుగులు చేసింది. కొన్ని రోజుల క్రితం బిగ్‌బాష్ లీగ్ 2022 టోర్నీలో సిడ్నీ థండర్ టీమ్ 15 పరుగులకి ఆలౌట్ అయ్యి చెత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.