Shreyas Iyer In ICU: శ్రేయస్ అయ్యర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వచ్చింది?
శ్రేయస్ అయ్యర్ గాయపడటం టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ. ఆయన అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే జట్టుకు వైస్-కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆయన ప్రదర్శన ఇలా ఉంది.
- By Gopichand Published Date - 05:18 PM, Mon - 27 October 25
Shreyas Iyer In ICU: టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్, వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer In ICU) సిడ్నీ వన్డే సందర్భంగా తీవ్ర గాయంతో ప్రస్తుతం సిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో ఉంచారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక వైద్య ప్రకటన విడుదల చేసింది. అందులో శ్రేయస్ ఆరోగ్యం నిలకడగా ఉందని, క్రమంగా కోలుకుంటున్నారని పేర్కొంది.
సిడ్నీ వన్డే సమయంలో తీవ్ర గాయం
అక్టోబర్ 25న సిడ్నీలో భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో శ్రేయస్ అయ్యర్ కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. పడగానే ఆయన నొప్పికి విలవిల్లాడారు. వెంటనే ఆయన్ని మైదానం నుండి బయటకు తీసుకెళ్లారు.
బీసీసీఐ ప్రకటన
బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. “సిడ్నీ వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్‌కు ఎడమ పక్కటెముకల క్రింద భాగంలో గాయమైంది. పరీక్షల అనంతరం ఆయన ప్లీహము చిట్లిపోయినట్లు తేలింది. వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స కొనసాగుతోంది” అని తెలిపింది.
Also Read: Jubilee Hills By Election : ఓటర్ల మద్దతు ఎవరికీ..టెన్షన్ టెన్షన్ అవుతున్న అభ్యర్థులు
బీసీసీఐ నుండి ఉపశమన వార్త
శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని. ఆయన కోలుకుంటున్నారని బోర్డు తెలిపింది. భారత వైద్య బృందం, సిడ్నీలోని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. భారత జట్టు డాక్టర్లు సిడ్నీలోనే శ్రేయస్‌తో పాటు ఉండి రోజువారీగా ఆయన కోలుకునే విధానాన్ని అంచనా వేస్తారని బీసీసీఐ పేర్కొంది.
వారం రోజుల పాటు ఆసుపత్రిలో
న్యూస్ ఏజెన్సీ పీటీఐ (PTI) సమాచారం ప్రకారం.. శ్రేయస్ అయ్యర్‌ను కనీసం వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచుతారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి ఆధారంగా క్రికెట్‌కు ఎంతకాలం దూరంగా ఉండాలో నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఆయన తిరిగి జట్టులోకి వచ్చే తేదీని బోర్డు ప్రకటించలేదు. 30 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ భారత జట్టు తరఫున ఇప్పటివరకు 14 టెస్టులు, 73 వన్డేలు, 51 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. ఈ క్రమంలో ఆయన 6 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలతో సహా 4832 పరుగులు చేశారు.
టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ
శ్రేయస్ అయ్యర్ గాయపడటం టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ. ఆయన అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే జట్టుకు వైస్-కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆయన ప్రదర్శన ఇలా ఉంది.
- మొదటి మ్యాచ్‌లో 11 పరుగులు
- రెండో మ్యాచ్‌లో 61 పరుగుల ఇన్నింగ్స్
- మూడో మ్యాచ్‌లో క్యాచ్ పడుతున్న సమయంలో గాయపడి మైదానం వీడారు.