HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Second Season Of Womens Premier League To Kickstart Tomorrow

Womens Premier League 2024: అమ్మాయిల ధనాధన్ కు అంతా రెడీ

మహిళల క్రికెట్ కు గత కొంత కాలంగా ఆదరణ పెరిగింది. దాదాపు ప్రతీ జట్టులోనూ క్వాలిటీ ప్లేయర్స్ ఉండడమే దీనికి కారణం. అదే సమయంలో టీ ట్వంటీ లీగ్‌ల్లో కూడా అమ్మాయిల ఆట ఆకర్షణీయంగా మారింది.

  • Author : Praveen Aluthuru Date : 22-02-2024 - 1:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Womens Premier League 2024
Womens Premier League 2024

Womens Premier League 2024: మహిళల క్రికెట్ కు గత కొంత కాలంగా ఆదరణ పెరిగింది. దాదాపు ప్రతీ జట్టులోనూ క్వాలిటీ ప్లేయర్స్ ఉండడమే దీనికి కారణం. అదే సమయంలో టీ ట్వంటీ లీగ్‌ల్లో కూడా అమ్మాయిల ఆట ఆకర్షణీయంగా మారింది. భారత అమ్మాయిలకు ఎన్నో ఏళ్ల నుంచి కలగా ఉన్న మహిళల ఐపీఎల్‌ను గత ఏడాదే బీసీసీఐ ప్రారంభించింది. తొలి సీజన్‌ కు అభిమానుల నుంచి మంచి ఆదరణే లభించింది. ఈ ఏడాది కొంచెం ముందుగానే రెండో సీజన్‌ మొదలవుతోంది. గత ఏడాది ఫార్మాట్లోనే అవే జట్లతో లీగ్‌ జరగబోతోంది. దాదాపుగా అన్ని జట్ల స్టార్‌ క్రికెటర్లూ ఆడబోతుండటంతో లీగ్‌ రసవత్తరంగా, హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

తొలి సీజన్లో విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్‌ మరోసారి టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, యూపీ వారియర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ ఈసారి ప్రదర్శన మార్చాలని పట్టుదలతో ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, రన్నరప్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. బెంగ‌ళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించ‌నున్నారు. ఈ సీజన్‌లో మొదటి దశ మ్యాచ్‌లు బెంగళూరులో రెండో దశ మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నాయి. తొలి సీజ‌న్‌లో ముంబైకే ప‌రిమిత‌మైన డ‌బ్ల్యూపీఎల్‌.. రెండో సీజ‌న్‌లో రెండు న‌గ‌రాల్లో జ‌రగ‌నుంది. మొత్తం ఐదు జట్లు ఒకదానితో ఒకటి రెండుసార్లు తలపడతాయి .
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది.రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో తలపడతాయి. ఎలిమినేటర్ విజేత టేబుల్ టాపర్ తో ఫైనల్లో తలపదుతుంది.భారత ప్రామాణిక కాలమానం ప్రకారం.. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, యూపీ వారియర్జ్ జట్లు అంతర్జాతీయ స్టార్‌లతో తమ సత్తాను చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రతి జట్టులో ఆల్ రౌండర్లు ఉండడంతో రసవత్తర మ్యాచ్ లు అభిమానులను అలరించడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

Also Read: Trisha : పెద్ద మనసు చేసుకొని నన్ను క్షేమించు – అన్నాడీఎంకే నేత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chinnaswamy Stadium
  • delhi capitals
  • February 23
  • First Match
  • mumbai indians
  • Women's Premier League 2024

Related News

Chinnaswamy Stadium

Chinnaswamy Stadium: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు అనుమతి!

విరాట్ కోహ్లీ, రిష‌బ్‌ పంత్ ఢిల్లీ జట్టు తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడతారని కొద్ది రోజుల క్రితమే ప్రకటించబడింది. ఢిల్లీ కొన్ని మ్యాచ్‌లు బెంగళూరులో జరగనున్నాయి.

    Latest News

    • పోలీసుల జోక్యంతో న్యాయం గెలిచింది.. ఎస్పీకి మహిళ పాలాభిషేకం

    • నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

    • జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

    • తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

    • రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd