Sarfaraz Khan Hits Five Fours: గర్జించిన సర్ఫరాజ్ ఖాన్, ఒకే ఓవర్లో 5 ఫోర్లు
శనివారం భారత్ ఎతో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో అతను తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతుల్లో 127.78 స్ట్రైక్ రేట్‌తో 46 పరుగులు చేశాడు.ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఆకాశ్ దీప్ ఓవర్లో వరుసగా 5 ఫోర్లు బాదాడు.
- By Praveen Aluthuru Published Date - 06:03 PM, Sat - 7 September 24

Sarfaraz Khan Hits Five Fours: ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ వరుసగా హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అయితే ఫిట్నెస్ కారణంగా సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan)కు అవకాశాలు కాస్త తగ్గినప్పటికీ తన ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. టీమిండియా త్వరలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. దీనికి ముందు సర్ఫరాజ్ ఖాన్ మరోసారి చెలరేగి ఆడాడు. ఒకే ఓవర్లో 5 ఫోర్లు బాది మరోసారి సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ కు తెరలేపాడు.
దులీప్ ట్రోఫీ(Duleep Trophy 2024)లో భాగంగా శనివారం భారత్ ఎతో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో అతను తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతుల్లో 127.78 స్ట్రైక్ రేట్‌తో 46 పరుగులు చేశాడు.ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. వికెట్ గురించి పట్టించుకోకుండా నిర్భయంగా బ్యాటింగ్ చేశాడు. ఆకాశ్ దీప్ ఓవర్లో వరుసగా 5 ఫోర్లు బాదాడు. ధృవ్ జురెల్ చేతిలో అవేష్ ఖాన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ 35 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు.
వచ్చే వారం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ సమయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టుకు భారత జట్టును ఎంపిక చేయవచ్చు. తొలి రౌండ్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు జట్టులో అవకాశం లభిస్తుంది.
సర్ఫరాజ్ ఖాన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 3 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ కాలంలో అతను 5 ఇన్నింగ్స్‌లలో 50 సగటుతో మరియు 79.36 స్ట్రైక్ రేట్‌తో 200 పరుగులు చేశాడు.టెస్టుల్లో సర్ఫరాజ్ ఖాన్ 3 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు 68 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కాగా సర్ఫరాజ్ ఆటతీరును పరిగణనలోకి తీసుకుంటే బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు అతని పేరును సెలక్టర్లు పరిశీలించవచ్చు.
Also Read: Hyundai Venue With Sunroof: తక్కువ ధరకే సన్‌రూఫ్‌తో వచ్చిన హ్యుందాయ్ వెన్యూ.. ప్రైస్ ఎంతంటే..?