HPGL Season 4: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ విజేత సామా ఏంజెల్స్
యువ గోల్ఫర్స్ ను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో సీజన్ లో సామా ఏంజెల్స్ ఛాంపియన్ గా నిలిచింది. బ్యాంకాక్ నికాంటి గోల్ఫ్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆ జట్టు టీమ్ ఆల్ఫా పై 60-20 స్కోర్ తో విజయం సాధించింది.
- By Praveen Aluthuru Published Date - 03:41 PM, Sun - 25 February 24
HPGL Season 4: యువ గోల్ఫర్స్ ను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో సీజన్ లో సామా ఏంజెల్స్ ఛాంపియన్ గా నిలిచింది. బ్యాంకాక్ నికాంటి గోల్ఫ్ క్లబ్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆ జట్టు టీమ్ ఆల్ఫా పై 60-20 స్కోర్ తో విజయం సాధించింది.
నెల రోజుల పాటు జరిగిన ఈ ఛాంపియన్ షిప్ లో మొత్తం 16 జట్ల నుంచి 160కి పైగా గోల్ఫర్స్ పాల్గొన్నారు. సీజన్ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతున్న సామా ఏంజెల్స్ ఫైనల్లో కూడా ఆధిపత్యం కనబరిచింది. మెగా ఫైనల్లో ఇరు జట్లలో ఎనిమిదేసి గోల్ఫర్లు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. మొత్తం 80 పాయింట్లు అందుబాటులో ఉన్న ఈ టైటిల్ ఫైట్‌లో విజయానికి 45 పాయింట్లు అవసరం అయ్యాయి. అయితే, రెండు టాప్ టీమ్స్ మధ్య హోరాహోరీగా సాగుతుందని అనుకున్న ఫైనల్‌ను సామా ఏంజెల్స్ వన్‌సైడ్‌గా మార్చేసింది.
సరోజ గడ్డం, మాధవి ఉప్పలపాటి ఓనర్లుగా, నేహా కెప్టెన్‌గా ఉన్న సామా ఏంజెల్స్ గత సీజన్లో గ్రూప్ దశలో సత్తాచాటి నాకౌట్‌కు చేరుకుంది. కానీ, క్వార్టర్ ఫైనల్లో టీమ్ ఆల్ఫా చేతిలో ఓడిపోయింది. దాంతో ఈ సీజన్‌కు పక్కాగా ప్రిపేర్ అయిన సామా స్టార్టింగ్ నుంచే నిలకడగా రాణించింది. తమ గ్రూప్‌లో టాపర్‌గా, ఓవరాల్‌గా రెండో ప్లేస్‌తో నాకౌట్‌కు దూసుకొచ్చింది. క్వార్టర్ ఫైనల్లో 80–0తో టూటోరూట్ను చిత్తు చేసింది.
తద్వారా హెచ్పీజీఎల్, టీపీజీఎల్లో ఒక నాకౌట్ రౌండ్లో అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన టీమ్‌గా సామా ఏంజెల్స్ రికార్డు సృష్టించింది. హెచ్పీజీఎల్లో తొలిసారి టైటిల్ నెగ్గడంపై సమా ఓనర్ సరోజ గడ్డం సంతోషం వ్యక్తం చేశారు. మహిళా శక్తికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నట్టు తెలిపారు.
Also Read: New York : అమెరికాలో భారత యువ జర్నలిస్ట్ మృతి..
Related News
Sarathi Studios : సరికొత్త టెక్నాలజీతో పున:ప్రారంభమైన సారథి స్టూడియోస్
ఇప్పుడు సరికొత్త టెక్నలాజి తో మళ్లీ సారథి స్టూడియో ను నిర్మించి..ఈరోజు ప్రారంభించారు