Sairaj Bahutule: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా కొత్త వ్యక్తి.. రేసులో లేకుండా బిగ్ ఆఫర్ కొట్టేసిన బహుతులే..!
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి సంబంధించిన సాయిరాజ్ బహుతులే (Sairaj Bahutule)ను శ్రీలంక టూర్‌కు టీమిండియా బౌలింగ్ కోచ్‌గా నియమించింది.
- Author : Gopichand
Date : 21-07-2024 - 6:17 IST
Published By : Hashtagu Telugu Desk
Sairaj Bahutule: జులై 22న సోమవారం భారత జట్టు శ్రీలంక పర్యటనకు బయలుదేరవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ టూర్‌లో టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఎవరు వెళ్తారనేది అంతకుముందు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పుడు దీనిపై ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకు టీమిండియా కొత్త బౌలింగ్ కోచ్ విషయంలో దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ పేరు ముందంజలో ఉండగా.. ఇప్పుడు శ్రీలంక టూర్‌లో మోర్కెల్ టీమిండియాతో కలిసి వెళ్లడం లేదని తేలింది. ఆ తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాత్కాలికంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి సంబంధించిన సాయిరాజ్ బహుతులే (Sairaj Bahutule)ను శ్రీలంక టూర్‌కు టీమిండియా బౌలింగ్ కోచ్‌గా నియమించింది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. బహుతులే త్వరలో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందిలో చేరనున్నారు. బహుతులే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా కూడా ఉన్నారు.
Also Read: Bhadrachalam : భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన నీటిమట్టం..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
జులై 27 నుంచి శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది
శ్రీలంక పర్యటనలో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఒకవైపు వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్‌గా కనిపిస్తుండగా, టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విరాట్ కోహ్లీ కూడా వన్డే సిరీస్‌లో పునరాగమనం చేయబోతున్నాడు. ఈ పర్యటన టీ20 సిరీస్‌తో ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ జులై 27న జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
కోచ్‌గా గంభీర్‌కి ఇదే తొలి సిరీస్
రాహుల్ ద్రవిడ్ తర్వాత గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కొత్త కోచ్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు గంభీర్ కోచింగ్‌లో శ్రీలంక పర్యటనలో టీమ్ ఇండియా తన తొలి సిరీస్ ఆడబోతోంది. గౌతమ్ గంభీర్ శ్రీలంక టూర్‌లో వన్డే, టీ20 సిరీస్‌లు రెండింటినీ గెలిచి తన ప్రస్థానాన్ని ప్రారంభించాలనుకుంటున్నాడు.