WTC 2023 Final: డీఆర్ఎస్ ఇలా కూడా తీసుకోవచ్చా రోహిత్ భాయ్..
బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో తొలిరోజు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్ఎస్ డిమాండ్ చేశాడు
- Author : Praveen Aluthuru
Date : 08-06-2023 - 4:31 IST
Published By : Hashtagu Telugu Desk
WTC 2023 Final: బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్ఎస్ డిమాండ్ చేశాడు. అయితే డీఆర్ఎస్ అడగడంలో ప్రత్యేకత చాటుకున్నారు. రోహిత్ శర్మ తన చేతులను వెనుకకు ఉంచి డీఆర్ఎస్ అడిగాడు. దీంతో సహచర ఆటగాళ్లు విచిత్రానికి గురయ్యారు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో ట్రెవిడ్ హెడ్ (146*), స్టీవ్ స్మిత్ (95*) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో తొలిరోజు కంగారూ జట్టు ఆట ముగిసే వరకు 85 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 327 పరుగులు చేసింది. అయితేఈ మ్యాచ్‌లో ఓ సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది భారత జట్టు మీడియం ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ లో బంతి మార్నస్ లబుషెన్ ప్యాడ్‌కు తగిలింది. దీంతో భారత జట్టు ఎల్‌బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసింది. అయితే అంపైర్ బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చాడు.
దీంతో కెప్టెన్ రోహిత్ శర్మతో సహా భారత జట్టు డీఆర్ఎస్ తీసుకోవాలని అనుకున్నారు. బంతి మిడిల్ స్టంప్ లైన్‌పై ఉందని, ఎల్‌బీడబ్ల్యూ అయి ఉండొచ్చని భావించిన రోహిత్ చేతులు వెనక్కి పెట్టి డీఆర్ఎస్ డిమాండ్ చేశాడు.అయితే రీప్లేలో కూడా భారత జట్టుకు అనుకూలంగా నిర్ణయం రాకపోయినప్పటికీ రోహిత్ ఈ ప్రత్యేకమైన శైలి అభిమానులకు నచ్చింది. రోహిత్ శర్మ DRS తీసుకున్న వీడియోను ICC షేర్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More: Test Retirement: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. రీఎంట్రీకి కారణమిదే..?