Rohit Sharma blessed With Baby Boy: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ.. మగ బిడ్డకు జన్మనిచ్చిన హిట్ మ్యాన్ భార్య
2015లో రోహిత్, రితిక పెళ్లి చేసుకున్నారు. 2018 డిసెంబర్‌లో రితిక ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. కూతురి పేరు సమైరా.
- By Gopichand Published Date - 01:34 AM, Sat - 16 November 24

Rohit Sharma blessed With Baby Boy:: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు శుభవార్త అందింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య రితికా సజ్దే శుక్రవారం మగబిడ్డకు (Rohit Wife Ritika With Baby Boy) జన్మనిచ్చింది. రోహిత్ శర్మ, రితికా సజ్దేలకు ఇప్పటికే ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు సమైరా. రోహిత్, సజ్దే డిసెంబర్ 13, 2015న వివాహం చేసుకున్నారు. అయితే మగబిడ్డ పుట్టినట్లు రోహిత్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
2015లో రోహిత్, రితిక పెళ్లి చేసుకున్నారు. 2018 డిసెంబర్‌లో రితిక ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. కూతురి పేరు సమైరా. రోహిత్, రితిక ల ప్రేమకథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మీడియా కథనాల ప్రకారం.. రితికా గతంలో రోహిత్ మేనేజర్‌గా ఉన్నట్లు కథనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులుగా మారి అది ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే రోహిత్, రితికను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందుకోసం విరాట్ కోహ్లీ సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా చేరుకున్నారు. కానీ రోహిత్ ఇంకా వెళ్లలేదు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి రోహిత్ సెలవు కోరినట్లు వార్తలు వచ్చాయి.
Welcome Jr Hitman 🤩🥳🔥 #RohitSharma𓃵 pic.twitter.com/UPdLEOk7cV
— Aditya Mall Rajput 🇮🇳 (@aditya_vishen__) November 15, 2024
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడతాడా?
ఈ వార్తతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ భాగమయ్యే అవకాశం ఉంది. నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ రెండోసారి తండ్రి కాబోతున్నాడని, దీని కారణంగా అతను టెస్ట్ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని గత నివేదికలు తెలిపాయి. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్
తొలి టెస్టు: నవంబర్ 22 నుంచి 26 వరకు
రెండో టెస్టు: డిసెంబర్ 6 నుంచి 10 వరకు
మూడో టెస్టు: డిసెంబర్ 14 నుంచి 18 వరకు
నాల్గవ టెస్ట్: 26 నుండి 30 డిసెంబర్
5వ టెస్టు: జనవరి 3 నుంచి 7 వరకు