HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rishabh Pants First Recovery Pics After Horrific Car Accident

Rishabh Pant: యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి తన ఫొటోలను పంచుకున్న పంత్.. ఎలా ఉన్నాడంటే..?

భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) 30 డిసెంబర్ 2022న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత సుమారు 1 నెల ఆసుపత్రిలో గడిపిన తరువాత పంత్ ఇప్పుడు తన ఇంటికి చేరుకున్నాడు. పంత్ కోలుకోవడం గురించి సోషల్ మీడియాలో అభిమానులను అప్‌డేట్ చేస్తూనే ఉన్నాడు.

  • Author : Gopi Date : 11-02-2023 - 6:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
pant
Resizeimagesize (1280 X 720) 11zon

భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) 30 డిసెంబర్ 2022న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత సుమారు 1 నెల ఆసుపత్రిలో గడిపిన తరువాత పంత్ ఇప్పుడు తన ఇంటికి చేరుకున్నాడు. పంత్ కోలుకోవడం గురించి సోషల్ మీడియాలో అభిమానులను అప్‌డేట్ చేస్తూనే ఉన్నాడు. రిషబ్ శుక్రవారం సాయంత్రం ఒక ట్వీట్ చేసాడు. అందులో అతను ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. అతను ఇప్పుడు కొంచెం నడవడం ప్రారంభించినట్లు ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక అడుగు.. ముందుకు, ఒక అడుగు బలంగా, ఒక అడుగు మెరుగ్గా అంటూ ట్వీట్ లో రాసుకొచ్చాడు.

పంత్ గతేడాది డిసెంబరు 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళుతుండగా కారు డివైడర్ ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుంది. స్థానికులైన ఇద్దరు యువకులు పంత్ ను కారు నుంచి బయటికి తీసుకువచ్చారు. అప్పటికే పంత్ కు తీవ్రగాయాలయ్యాయి. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో పంత్ కు ప్రమాదం తప్పింది.

One step forward
One step stronger
One step better pic.twitter.com/uMiIfd7ap5

— Rishabh Pant (@RishabhPant17) February 10, 2023

టీమిండియా స్టార్ ఆటగాడు రిషభ్ పంత్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్ తాను వేగంగా కోలుకుంటున్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఫోటో రిలీజ్ చేశాడు. చికిత్స తర్వాత పంత్ ఫస్ట్ ఫోటో ఇదే కావడం గమనార్హం. ఇందులో అత‌డి కుడి కాలికి బ్యాండేజ్ ఉండగా, వాకింగ్ స్టిక్స్ ప‌ట్టుకొని న‌డుస్తున్నాడు. పంత్‌ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: IND vs AUS Highlights: రోహిత్‌ శతకం, మెరిసిన జడ్డూ-అక్షర్‌.. రెండోరోజూ మనదే!

2022 చివరిలో బంగ్లాదేశ్ పర్యటనలో ఆడిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పంత్ భారత జట్టు కోసం అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టెస్ట్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో అతని బ్యాట్‌తో 46 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రెండవ మ్యాచ్‌లో జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 93 పరుగులు చేశాడు. పంత్ ఎప్పుడు మైదానంలోకి వస్తాడనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • indian cricket team
  • Rishabh Pant
  • Rishabh Pant Photo

Related News

    Latest News

    • Rahul Gandhi: సీబీఎస్‌ఈపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

    • TTD Admissions 2026: టీటీడీ సంగీత, నృత్య అడ్మిషన్లు దరఖాస్తులకు ఆహ్వానం

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ రికార్డులు ఇవే!

    • Lakshmi Parvathi: టీడీపీ పై లక్ష్మీపార్వతి సంచలన ఆరోపణలు

    • GV Anjaneyulu: విగ్రహాల ధ్వంసం.. అంతా జగన్ ప్లానే : జీవీ ఆంజనేయులు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd