IND vs AUS Highlights: రోహిత్ శతకం, మెరిసిన జడ్డూ-అక్షర్.. రెండోరోజూ మనదే!
రెండో రోజు బ్యాటర్లు సత్తా చాటారు. ఫలితంగా టీమిండియా (Team india) భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది.
- By Naresh Kumar Published Date - 05:34 PM, Fri - 10 February 23

IND vs AUS: నాగ్‌పూర్ టెస్టు (Test Match)లో భారత్ పట్టుబిగించింది. తొలిరోజు బౌలర్లు చెలరేగితే… రెండో రోజు బ్యాటర్లు సత్తా చాటారు. ఫలితంగా టీమిండియా (Team india) భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండోరోజు ఆటలో కెప్టెన్ రోహిత్‌శర్మ (Rohit Sharma) బ్యాటింగే హైలెట్. చాలా కాలంగా పూర్తిస్థాయి ఫామ్‌లోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్న హిట్‌మ్యాన్ సెంచరీ (Centurey)తో అదరగొట్టాడు. అశ్విన్ త్వరగానే ఔటైనా…రోహిత్ మాత్రం దూకుడుగా ఆడాడు. దాదాపు ఏడాదిన్నర విరామం తర్వాత టెస్టుల్లో సెంచరీ నమోదు చేశాడు. చివరగా రోహిత్ సెప్టెంబరు 2021లో ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌పై శతకం చేశాడు.
ఈ ఘనతతో మూడు ఫార్మాట్లలో సెంచరీ నమోదు చేసిన భారత కెప్టెన్ (Indian Captain)గా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు.పుజారా, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. అయితే ఓ పక్క వికెట్లు పడుతున్నప్పటికీ హిట్ మ్యాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. 171 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ 121 పరుగులకు ఔటవడంతో భారత్ (Team india) ఇన్నింగ్స్ త్వరగానే ముగిసేలా కనిపించింది. ఈ దశలో రవీంద్ర జడేజా , అక్షర్ పటేల్ ఆదుకున్నారు. వీరి పార్టనర్‌షిప్ ఆధిక్యాన్ని 130 దాటేలా చేసింది. ఆసీస్ బౌలర్లు కాస్త ఇబ్బంది పెట్టినా నిలకడగా ఆడిన వీరి జోడీ ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 81 పరుగులు జోడించారు. తొలిరోజు బంతితో అదరగొట్టిన జడేజా (Jadeja) బ్యాట్‌తోనూ మెరిసాడు.
కీలక సమయంలో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. జడేజా, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలు సాధించారు. గత కొంతకాలంగా ఆల్‌రౌండర్ రోల్‌కు పూర్తి న్యాయం చేస్తున్న అక్షర్ పటేల్ ఎటాకింగ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి పార్టనర్‌షిప్ బ్రేక్ చేసేందుకు ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. రెండోరోజు ఆటముగిసే సమయానికి భారత్ (Team india) 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 8 ఫోర్లతో 52, జడేజా 9 ఫోర్లతో 66 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడోరోజు తొలి సెషన్ కీలకం కానుంది. టీమిండియా ఆధిక్యం 200 దాటితే ఆసీస్‌కు కష్టాలు తప్పవు. ఆసీస్ బౌలర్లలో అరంగేట్రం మర్ఫీ 5 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Mahesh and Namrata: మహేశ్ పై నమ్రత ముద్దుల వర్షం.. ఓల్డ్ ఫొటో వైరల్!