Rishabh Pant Net Worth: రిషబ్ పంత్ ఆస్థి, లైఫ్ స్టైల్, లగ్జరీ కార్లు
Rishabh Pant Net Worth: రిషబ్ పంత్‌కు కార్లంటే చాలా ఇష్టం. పంత్ వద్ద 2 కోట్ల విలువైన ఫోర్డ్ మస్టాంగ్ కారు ఉండగా, మెర్సిడెస్ బెంజ్ జిఎస్‌సి విలువ 75 లక్షలు. ఆడి ఎ-8 కారు విలువ రూ.1.3 కోట్లు. మెర్సిడెస్-బెంజ్ (Mercedes Benz GLE) ధర రూ. 2 కోట్లు
- Author : Praveen Aluthuru
Date : 04-10-2024 - 10:25 IST
Published By : Hashtagu Telugu Desk
Rishabh Pant Net Worth: పంత్ అటాకింగ్ బ్యాటింగ్ అభిమానులను ఎంతగానో ఉత్తేజపరుస్తుంది. చాన్నాళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడిన పంత్ బంగ్లాదేశ్ పై ఆ కరువును తీర్చుకున్నాడు.అద్భుత సెంచరీ చేసి ప్రత్యర్థి జట్లకు ప్రమాద హెచ్చరికలు పంపాడు. రిషబ్ పంత్ టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ కావడంతో బీసీసీఐ అతడిని గ్రూప్-బిలో చేర్చింది. అందుకోసం బోర్డు అతనికి ఏటా 3 కోట్లు వేతనంగా ఇస్తుంది.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషబ్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2022లో డిసి అతడిని 16 కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ ఒక టెస్టు మ్యాచ్ ద్వారా 15 లక్షలు, వన్డే మ్యాచ్ ద్వారా .6 లక్షలు, టీ20 మ్యాచ్ ద్వారా.3 లక్షలు సంపాదిస్తున్నాడు. రూర్కీలోని నాగరిక ప్రాంతంలో రిషబ్ పంత్‌కు అందమైన ఇల్లు ఉంది, దీని ధర 60 లక్షల నుండి 1 కోటి మధ్య ఉంటుందని చెబుతున్నారు. అతను తన తల్లి మరియు సోదరితో కలిసి ఈ ఇంట్లో నివసిస్తున్నాడు.
రిషబ్ పంత్ (Rishabh Pant)కు కార్లంటే చాలా ఇష్టం. పంత్ వద్ద 2 కోట్ల విలువైన ఫోర్డ్ మస్టాంగ్ కారు ఉండగా, మెర్సిడెస్ బెంజ్ జిఎస్‌సి విలువ 75 లక్షలు. ఆడి ఎ-8 కారు విలువ రూ.1.3 కోట్లు. మెర్సిడెస్-బెంజ్ (Mercedes Benz GLE) ధర రూ. 2 కోట్లు. అయితే పంత్ కి కేవలం క్రికెట్ ద్వారానే కాకుండా ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా చాలా సంపాదిస్తాడు. boAt Adidas, JSW Steel, Noise, రియల్మీ (Realme), డ్రీమ్11 (Dream11), Ketch, SG, Himalayan, Boost మరియు Cadbury వంటి నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్‌లతో డీల్ కుదిర్చుకున్నాడు. గూగుల్‌లో దొరికిన సమాచారం ప్రకారం పంత్ మొత్తం నికర విలువ 100 కోట్లు.
Also Read: IND vs BAN T20 series: గ్వాలియర్ లో పరుగుల వరదే తొలి టీ ట్వంటీ పిచ్ రిపోర్ట్ ఇదే