HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rishab Pant Auction Rs 27 Crores Not Rs 18 Crores Only

Rishab Pant Auction: రూ. 27 కోట్లు కాదు పంత్ చేతికి రూ. 18 కోట్లు మాత్రమే..!

27 కోట్లలో పంత్ కు దక్కేది కేవలం 18 కోట్లు మాత్రమే. వాస్తవానికి భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను స్లాబ్‌ల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రతి సంవత్సరం 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం ఉంటే దానిలో 30% పన్నుగా చెల్లించాలి.

  • Author : Naresh Kumar Date : 29-11-2024 - 6:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rishab Pant Auction
Rishab Pant Auction

Rishab Pant Auction: మెగా వేలానికి ముందు రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసింది. దీంతో పంత్ (Rishab Pant Auction) 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి ప్రవేశించాడు. పంత్ కోసం మొదట లక్నో సూపర్ జెయింట్స్ వేలం వేసింది. ఆర్సీబీ కూడా పంత్ కోసం పోటీ పడింది. ఇరుజట్ల మధ్య 11.25 కోట్ల వరకు పోటీ కొనసాగింది. అప్పుడు 12 కోట్లు అంటూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎంట్రీ ఇచ్చింది.దీంతో హైదరాబాద్ మరియు లక్నో మధ్య భీకర పోటీ కనిపించింది. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ RTM ద్వారా 20.755 కోట్లకు పంత్ ను కొనుగోలు చేయాలని భావించింది. అయితే లక్నో 27 కోట్ల బిడ్ వేసింది. దీంతో మిగతా జట్లన్నీ సైలెంట్ అయిపోయాయి. ఈ విధంగా ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు కొనుగోలు చేసిన శ్రేయాస్ అయ్యర్‌ను అధిగమించాడు. అయితే పంత్ అంత మొత్తాన్ని అందుకుంటాడా అంటే అది సాధ్యపడదు.

Also Read: Delhi Assembly Elections :’ఆప్’తో పొత్తు లేదు.. ఒంటరిగా బరిలోకి : కాంగ్రెస్‌

27 కోట్లలో పంత్ కు దక్కేది కేవలం 18 కోట్లు మాత్రమే. వాస్తవానికి భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను స్లాబ్‌ల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రతి సంవత్సరం 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం ఉంటే దానిలో 30% పన్నుగా చెల్లించాలి. అందువల్ల పంత్ కు ఫ్రాంచైజీ ఇచ్చే 27 కోట్లలో 30% అతని ఖాతా నుండి తీసివేయబడుతుంది. ఫలితంగా రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్‌తో తన మూడేళ్ల పదవీకాలంలో ప్రతి సీజన్‌కు 18.9 కోట్ల వేతనం మాత్రమే పొందనున్నాడు. కాంట్రాక్ట్ విలువ 27 కోట్లు అయితే 8.1 కోట్లు పన్ను రూపంలో పోతుంది. దీంతో పంత్ చేతికి 18.9 కోట్లు మాత్రమే అందుతాయి. ఐపీఎల్ లో పంత్ రికార్డులు అద్భుతంగ ఉన్నాయి. రిషబ్ పంత్ 111 మ్యాచ్‌లలో 148.93 స్ట్రైక్ రేట్‌తో 3284 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ మరియు 18 అర్ధ సెంచరీలు చేశాడు. ఐపీఎల్‌లో పంత్ 75 క్యాచ్‌లు, 23 స్టంపింగ్‌లు చేశాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • Indian Premier League
  • IPL 2025
  • IPL 2025 Rishabh Pant
  • Rishabh Pant
  • Rishabh Pant To LSG
  • sports news

Related News

This is the real story behind the 'A' symbol celebration for *Sooryavanshi*.

Vaibhav Suryavanshi: సూర్యవంశీ A సింబ‌ల్ సెల‌బ్రేష‌న్ వెనుక అస‌లు కథ ఇదే

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారిస్తున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఈ కుర్రాడు వీరబాదుడు బాదాడు. హాఫ్ సెంచరీ తర్వాత వేళ్లతో ‘A’ సింబల్ చూపిస్తూ చేసిన సంబరాలు నెట్టింట వైరల్‌గా మారాయి. సీక్రెట్ ఇదే మ్యాచ్ ముగిసిన తర్వాత కామెంటేటర్ మురళీ కార్తీక్ ఆ ‘A’ సింబల్ సెలబ్రేషన్స్ గురించి వైభవ్‌ను అడిగారు. మొదట

    Latest News

    • Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

    • Prakash Raj: కాక్‌రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మోదీపై సెటైర్.. వీడియో వైరల్!

    • Kamal Haasan: ప్రధాని మోదీకి కమల్ హాసన్ మద్దతు

    • APSFTVTDC: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..

    • APPSC: ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టుల భర్తీ: దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

    Trending News

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

      • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd