HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rcb Star Anticipatory Bail Rejected

ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు చుక్కెదురు!

జైపూర్ మెట్రోపాలిటన్ కోర్టు (POCSO కోర్టు-3) న్యాయమూర్తి అల్కా బన్సల్ తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Author : Gopichand Date : 24-12-2025 - 6:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
RCB Star
RCB Star

RCB Star: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఆర్‌సీబీ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. జైపూర్‌లోని పోక్సో (POCSO) కోర్టు ఈ మేరకు స్టార్ బౌలర్‌కు షాక్ ఇస్తూ తీర్పు వెలువరించింది.

కోర్టు ఆదేశంలో ఏముంది?

జైపూర్ మెట్రోపాలిటన్ కోర్టు (POCSO కోర్టు-3) న్యాయమూర్తి అల్కా బన్సల్ తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రికార్డుల్లో ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం యశ్ దయాల్‌ను అక్రమంగా ఈ కేసులో ఇరికించినట్లు ఎక్కడా నిరూపితం కాలేదని, అందుకే ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది.

Also Read: భోజనం తర్వాత నిద్ర వస్తోందా? అది కేవలం బద్ధకం కాకపోవచ్చు!

ఆర్సీబీకి ఎందుకు ఇది బ్యాడ్ న్యూస్?

యశ్ దయాల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీ తరపున అద్భుత ప్రదర్శన చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఫ్రాంచైజీ, ఐపీఎల్ 2026 కోసం ఆయనను రూ. 5 కోట్లకు రిటైన్ చేసుకుంది. 2025లో 15 మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టాడు. 2024లో 14 మ్యాచ్‌లలో 15 వికెట్లు తీశారు. జట్టు ప్రధాన బౌలింగ్ అస్త్రాలలో ఒకరైన దయాల్ ఇప్పుడు చట్టపరమైన ఇబ్బందుల్లో పడటం జట్టు ప్రణాళికలను దెబ్బతీసే అవకాశం ఉంది.

యశ్ దయాల్ తరపు న్యాయవాది వాదన

ఈ కేసుపై యశ్ దయాల్ తరపు న్యాయవాది స్పందిస్తూ.. యశ్ ఆ బాలికను కేవలం బహిరంగ ప్రదేశాల్లోనే కలిశారని, వారిద్దరూ ఎప్పుడూ ఏకాంతంగా కలవలేదని వాదించారు. సదరు బాలిక తనను తాను మేజర్‌గా చెప్పుకుందని, ఆర్థిక ఇబ్బందుల నెపంతో యశ్ నుండి డబ్బు తీసుకుందని, ఆపై మరిన్ని డబ్బుల కోసం వేధిస్తోందని ఆయన కోర్టుకు తెలిపారు.

IPL 2026 కోసం ఆర్‌సీబీ (RCB) పూర్తి జట్టు

  • రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బేథెల్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిఖ్ సలామ్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ, వెంకటేష్ అయ్యర్, మంగేష్ యాదవ్, జాకబ్ డఫీ, జోర్డాన్ కాక్స్, సాత్విక్ దేశ్వాల్, విక్కీ ఓస్త్వాల్, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2026
  • IPL News
  • POCSO
  • RCB Star
  • sports news
  • Yash Dayal

Related News

Shubman Gill

టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కార‌ణ‌మిదేనా?

ఈ ఏడాది గిల్ టెస్ట్ కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 754 పరుగులు చేసి అదరగొట్టారు. దీంతో ఆయనకు వన్డే కెప్టెన్సీ, టీ20 వైస్ కెప్టెన్సీ కూడా దక్కాయి.

  • Rohit- Virat

    విజయ్ హజారే ట్రోఫీ.. సెంచ‌రీలు చేసిన‌ కోహ్లీ, రోహిత్!

  • Sunil Gavaskar

    కోర్టు ర‌క్ష‌ణ పొందిన సునీల్ గ‌వాస్క‌ర్‌.. అస‌లు స్టోరీ ఇదే!

  • Vaibhav Suryavanshi

    చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 5 సిక్స‌ర్లు, 16 ఫోర్ల‌తో 190 ర‌న్స్‌ !

  • Domestic Cricketers

    మహిళా డొమెస్టిక్ క్రికెటర్లకు భారీగా పెరిగిన ఫీజులు!

Latest News

  • క్రిస్మస్ పండుగ.. డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?

  • అరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్రం నిషేధం!

  • జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌.. డేట్ కూడా ఫిక్స్‌!

  • భారత విమానయాన రంగంలోకి కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్!

  • విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల విధ్వంసం.. ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ!

Trending News

    • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

    • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

    • ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

    • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd