RCB vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న డు ప్లెసిస్.. ప్లేఆఫ్ అవకాశాలు
ఐపీఎల్ 2024 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీకి ఇది 7వ మ్యాచ్. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని ఆర్‌సిబి జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.
- By Praveen Aluthuru Published Date - 07:33 PM, Mon - 15 April 24

RCB vs SRH: ఐపీఎల్ 2024 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీకి ఇది 7వ మ్యాచ్. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని ఆర్‌సిబి జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. మరోవైపు, ప్రస్తుత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్‌లలో మూడు విజయాలు సాధించగా, 2 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూస్తోంది. కాగా ఆర్సీబీకి ఈ మ్యాచ్ కీలకమైంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లోఆర్సీబీ ఓడిపోతే, ప్లేఆఫ్‌కు చేరుకునే మార్గం చాలా కష్టం అవుతుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ సమయంలో ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మేం చేస్తున్నట్టుగానే ముందుగా బౌలింగ్ చేస్తాం. మేము ఇంకా మా అత్యుత్తమ క్రికెట్ ఆడలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మా ప్లే-11లో మార్పులు చేశాం. గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్ లో ఆడటం లేదు. ప్లేయింగ్-11లో లాకీ ఫెర్గూసన్‌కు చోటు దక్కిందని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
ఆర్సీబీ తుది జట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, విల్ జాక్వెస్, రజత్ పాటిదార్, సౌరభ్ చౌహాన్, దినేష్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్, విజయ్ కుమార్, రీస్ టాప్లీ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్.
Also Read: Hardik Pandya: హార్దిక్ ఫిట్నెస్ పై సీనియర్ల అనుమానాలు