HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ravichandran Ashwin Fined For Breaching Ipl Code Of Conduct

Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్ కి భారీ షాక్.. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత..!

గత బుధవారం చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ (Ravichandran Ashwin) ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని (IPL Code Of Conduct) ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు.

  • Author : Gopichand Date : 14-04-2023 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
R Ashwin
Resizeimagesize (1280 X 720) 11zon

గత బుధవారం చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ (Ravichandran Ashwin) ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని (IPL Code Of Conduct) ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. అంపైర్ నిర్ణయంపై వ్యాఖ్యానించినందుకు అశ్విన్ జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చింది. మ్యాచ్‌లో మంచు కారణంగా బంతిని మార్చాలనే అంపైర్ల నిర్ణయంపై అశ్విన్ వ్యాఖ్యానించాడ. దాని కారణంగా అతనికి ఈ జరిమానా పడింది.

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 175/8 పరుగులు చేసింది. చెన్నై జట్టు ఛేజింగ్‌లో విఫలమైంది. ఈ మ్యాచ్ ద్వారా రాజస్థాన్ ఐపీఎల్-16లో మూడో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన రవిచంద్రన్ అశ్విన్ ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించినట్లు ఐపిఎల్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

Also Read: Kagiso Rabada: ఈ ఐపీఎల్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే రికార్డు సృష్టించిన కగిసో రబడా.. మలింగాను వెనక్కి నెట్టి..!

‘బంతిని మార్చమని అంపైర్‌ని అడగలేదు’

మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో అశ్విన్ మాట్లాడుతూ.. ‘బంతిని మార్చాలన్న అంపైర్ నిబంధన వల్ల మ్యాచ్ ఫలితం మంచిదైనా చెడు కావచ్చు. కాబట్టి సమతూకం పాటించాల్సిన అవసరం ఉంది. మా జట్టు బౌలింగ్ చేస్తోంది, బంతిని మార్చమని మేము అంపైర్‌ని అడగలేదు, కానీ అంపైర్ బంతిని మార్చాడు. దీనికి కారణం ఏమిటని అడగ్గా.. అలా చేసే అధికారం తమకు ఉందని చెప్పారని తెలిపాడు. ఇది తమకు అనుకూలమైన నిర్ణయమే అయినా.. ఇలా చేయడం తనకు నచ్చలేదన్నాడు.

అశ్విన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అశ్విన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో అతను బంతితో పాటు బ్యాట్‌తోనూ జట్టుకు తనవంతు సహకారం అందించాడు. ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన అశ్విన్ 22 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ashwin
  • IPL 2023
  • Match Fees Cut
  • rajasthan royals
  • Ravichandran Sshwin

Related News

Gautam Gambhir

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

ఈ నివేదికలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియాకు ఒలింపిక్ మెడల్ అందించాలని కోరుకుంటున్నారు.

  • Rajasthan Royal Ipl 2026

    టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కి రాజస్థాన్ రాయల్స్ నుంచి బంప‌ర్ ఆఫ‌ర్లు!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd