Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త కోచ్.. ఎవరో తెలుసా?
బహుతులే గతంలో కూడా 2018 నుండి 2021 వరకు రాజస్థాన్ రాయల్స్ కోచింగ్ యూనిట్‌లో భాగంగా ఉన్నారు. కానీ రాజస్థాన్ నుండి విడిపోయిన తర్వాత అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో పనిచేస్తున్నాడు.
- By Gopichand Published Date - 06:07 PM, Thu - 13 February 25

Rajasthan Royals: ఐపీఎల్ 2025కి ముందు రాజస్థాన్ రాయల్స్‌కు (Rajasthan Royals) కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్‌ను ప్రకటించారు. భారత మాజీ ఆటగాడు సాయిరాజ్ బహుతులేకు రాజస్థాన్ రాయల్స్ ఈ బాధ్యతలు అప్పగించింది. అతను రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కరతో కలిసి పని చేస్తాడు. IPL 2025కి ముందు రాజస్థాన్ రాయల్స్ తమ కోచింగ్ యూనిట్‌లో పెద్ద మార్పు చేసింది.
బహుతులేకు బాధ్యతలు
బహుతులే గతంలో కూడా 2018 నుండి 2021 వరకు రాజస్థాన్ రాయల్స్ కోచింగ్ యూనిట్‌లో భాగంగా ఉన్నారు. కానీ రాజస్థాన్ నుండి విడిపోయిన తర్వాత అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో పనిచేస్తున్నాడు. అయితే ఇప్పుడు రాజస్థాన్ మరోసారి బహుతులేను తన జట్టులో చేర్చుకుంది. అతను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేయబోతున్నాడు.
Also Read: Dalai Lama Z-Category Security: దలైలామాకు జెడ్ కేటగిరీ భద్రత.. కారణమిదే?
బహుతులే ఆనందం వ్యక్తం చేశాడు
రాజస్థాన్‌కు తిరిగి వచ్చిన తర్వాత సాయిరాజ్ బహుతులే చాలా సంతోషంగా ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌కు పునరాగమనం చేయడం గొప్ప గౌరవమని అన్నాడు. ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి రాజస్థాన్ అద్భుతంగా ఉంటుంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, మిగతా కోచింగ్ స్టాఫ్‌తో కలిసి మా బౌలింగ్ అటాక్‌ను బలోపేతం చేయడానికి, జట్టు విజయానికి దోహదపడేందుకు నేను చాలా ఎదురు చూస్తున్నాను. రాబోయే సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కోసం మేము కలిసి గొప్ప విజయాలు సాధించాలని ఎదురుచూస్తున్నాము. ఇదే మా లక్ష్యం అని ఆయన ప్రకటించారు.
IPL 2025 కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు
సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ (రూ. 12.50 కోట్లు), మహేశ్ తీక్షణ, వనీందు హసరంగా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, నితీష్ రాణా, తుషార్ దేశ్‌పాండే, శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్, ఫజల్‌హక్ ఫరూఖీ, వైభవ్ సూర్యవంశీ, క్వేనా మఫాకా, కునాల్ రాథోడ్, అశోక్ శర్మ.
కెరీర్ ఇదే
భారత్ తరఫున 2 టెస్టు మ్యాచ్‌లు ఆడిన సాయిరాజ్ బహుతులే 39 పరుగులతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా 8 వన్డేల్లో 23 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టాడు. అతను 2003లో భారత్ తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు.