R Ashwin: ఫోర్ కొట్టాడు…ఏడు సార్లు ఛాతీని చరుచుకున్నాడు…రవిచంద్రన్ అశ్విన్ వైరల్ వీడియో..!!
రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
- By Hashtag U Published Date - 12:28 PM, Sat - 21 May 22
రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో సూపర్ ఇన్నింగ్స్ తో అశ్విన్ దుమ్ములేపాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జట్టుకు మంచి విజయాన్ని అదించిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అంతకుముందు డెవోన్ కాన్వేను వికెట్లు ముందు దొరికాడు.
ఈ అద్భుత ఇన్నింగ్స్ ను పక్కనపెడితే…గ్రౌండులో అశ్విన్ సెలబ్రేషన్ చేసుకోవడంతోనెటిజన్లు విశేషంగా ఆకర్షిస్తోంది. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే అశ్విన్…లాస్ట్ ఓవర్లో ఫోర్ కొట్టాడు. తర్వాత తన ఛాతీని ఏడుసార్లు కొట్టుకుని సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. బంతి బౌంబడరీ లైన్ తాకడంతో గుండెను చరుచుకుంటూ సంబరాలు చేసుకోవడం కెమెరాల్లో చిక్కింది. ఇప్పుడా వీడియోపై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.
Related News
RR vs PBKS: బట్లర్ లేకుండానే బరిలోకి.. రాజస్థాన్ రాయల్స్ లో మైనస్ అదే
రాజస్థాన్ ఆడబోయే మిగతా మ్యాచ్ ల్లో జొస్ బట్లర్ లేకపోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లాండ్ ప్లేయర్స్ తమ దేశానికి తిరిగిరావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశించింది. దీంతో బట్లర్ జట్టుని వీడి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు.