HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Problems Pile On For Australia Star Players Ruled Out Champions Trophy 2025

Australia: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ‌.. నిన్న క‌మిన్స్‌, నేడు హేజిల్‌వుడ్‌!

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మిచెల్ మార్ష్ ఔటైన తర్వాత‌ ఆటగాళ్లు అంద‌రూ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి దూరం అయ్యేందుకు క్యూ కట్టినట్లు అనిపించింది.

  • By Gopichand Published Date - 03:36 PM, Thu - 6 February 25
  • daily-hunt
Australia
Australia

Australia: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు ఆస్ట్రేలియాకు (Australia) రెండు భారీ షాక్‌లు త‌గిలాయి. మార్కస్ స్టోయినిస్ రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే.. కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ కూడా టోర్నీకి దూరంగా ఉండ‌నున్న‌ట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌క‌టించింది. దీంతో ఆస్ట్రేలియా తొలి జట్టులో నాలుగు మార్పులు చేయాల్సి ఉంటుంది.

పాట్ కమిన్స్, హేజిల్‌వుడ్ దూరం

పాప పుట్టడంతో పాట్ కమిన్స్ శ్రీలంక పర్యటనకు వెళ్లలేదు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో చీలమండ గాయం సమస్యతో ఇబ్బంది పడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఇప్పుడు కమిన్స్ దూరం కావడంతో ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్‌ని త్వరలో ప్రకటించాల్సి ఉంటుంది.

Also Read: US President Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణయం.. మహిళల క్రీడల్లోకి ట్రాన్స్‌జెండర్స్‌ నిషేధం

బెన్ ద్వార్షియస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, స్పెన్సర్ జాన్సన్‌లు వన్డే జట్టులోకి వచ్చారు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో జోష్ హేజిల్‌వుడ్ గాయపడ్డాడు. ఆ తర్వాత అతను జ‌ట్టులోకి వ‌స్తూ పోతున్నాడు. ప్ర‌స్తుతం ఛాంపియ‌న్స్ ట్రోఫీకి దూర‌మైన హేజిల్‌వుడ్‌ ఐపీఎల్ ఆడటంపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయి.

Australia will need to make four changes to their preliminary squad for the upcoming #ChampionsTrophy with confirmation skipper Pat Cummins and fellow fast bowler Josh Hazlewood have been ruled out of the tournamenthttps://t.co/zYgCBUQb0v

— cricket.com.au (@cricketcomau) February 6, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు నాలుగు షాక్‌లు

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మిచెల్ మార్ష్ ఔటైన తర్వాత‌ ఆటగాళ్లు అంద‌రూ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి దూరం అయ్యేందుకు క్యూ కట్టినట్లు అనిపించింది. మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ గాయాల కార‌ణంగా జ‌ట్టుకు దూరంగా కాగా.. మార్కస్ స్టోయినిస్ రిటైర్మెంట్ కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఆస్ట్రేలియా జట్టు త్వరలో కొత్త కెప్టెన్‌ను ప్రకటించవచ్చు. కెప్టెన్ పోటీలో ఆసీస్ ఆట‌గాళ్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ ఉన్నార‌ని స్థానిక మీడియా పేర్కొంది. ఇక‌పోతే ఐసీసీ నిర్వ‌హించ‌నున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఈసారి పాకిస్థాన్‌, దుబాయ్ వేదిక‌గా హైబ్రిడ్ మోడ‌ల్‌లో జ‌ర‌గ‌నున్న విషయం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ఈ టోర్నీ పాకిస్థాన్ వేదిక‌గా ప్రారంభం కానుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • Champions Trophy 2025
  • Cummins
  • ICC Champions Trophy
  • Josh Hazlewood
  • Spots News

Related News

Minister Lokesh receives rare invitation from Australian government

Nara Lokesh : మంత్రి లోకేశ్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి అరుదైన ఆహ్వానం

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం మంత్రి లోకేశ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ (Special Visits Program) లో పాల్గొనాల

    Latest News

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd