IPL 2025 Purple Cap Table: ఐపీఎల్ 2025లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ వీరులు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మొదటి సీజన్ నుంచి ప్రతి సంవత్సరం అత్యధిక రన్స్ స్కోర్ చేసిన బ్యాట్స్‌మన్‌కు ఆరెంజ్ క్యాప్ లభిస్తుంది. అలాగే ప్రైజ్ మనీ కూడా ఇస్తారు.
- By Gopichand Published Date - 05:57 PM, Sun - 20 April 25

IPL 2025 Purple Cap Table: ఐపీఎల్ 2025లో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ (IPL 2025 Purple Cap Table) కోసం గట్టి పోటీ కనిపిస్తోంది. ప్రతి మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్.. బౌలర్లు లెక్కలను మార్చేస్తున్నారు. ఒకవైపు 10 జట్ల మధ్య టైటిల్ కోసం ఆసక్తికరమైన పోరు సాగుతుండగా మరోవైపు కొంతమంది ఆటగాళ్ల మధ్య ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ కోసం పోటీ నడుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మొదటి సీజన్ నుంచి ప్రతి సంవత్సరం అత్యధిక రన్స్ స్కోర్ చేసిన బ్యాట్స్‌మన్‌కు ఆరెంజ్ క్యాప్ లభిస్తుంది. అలాగే ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ లభిస్తుంది. ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. ప్రతి ఆటగాడి కల ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ లేదా పర్పుల్ క్యాప్ గెలవడం.
Also Read: Curtains: మీరు డోర్ కర్టెన్లు వాడుతున్నారా? అయితే వీటికి కూడా వాస్తు ఉంటుందట!
ప్రసిద్ధ్ కృష్ణ వద్ద పర్పుల్ క్యాప్
గుజరాత్ టైటాన్స్ వేగవంతమైన ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ 2025లో అతని వికెట్ల సంఖ్య 14కు చేరింది. చెన్నై సూపర్ కింగ్స్ నూర్ అహ్మద్ నుంచి పర్పుల్ క్యాప్‌ను లాక్కున్నాడు. ఇప్పుడు పర్పుల్ క్యాప్ రేసులో ఢిల్లీ క్యాపిటల్స్ కుల్దీప్ యాదవ్ 12 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. చెన్నై నూర్ అహ్మద్ 12 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆర్‌సీబీ జోష్ హాజిల్‌వుడ్ కూడా 12 వికెట్లతో ఉన్నాడు. అయితే తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఆరెంజ్ క్యాప్ రేసులో యశస్వీ జైస్వాల్
శనివారం గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్‌ను తన సొంతం చేసుకున్నాడు. అయితే కొద్దిసేపటికే నికోలస్ పూరన్ మళ్లీ ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అత్యధిక రన్స్ స్కోర్ చేసిన బ్యాట్స్‌మెన్‌లలో నికోలస్ పూరన్ 368 రన్స్‌తో మొదటి స్థానంలో ఉన్నాడు. సుదర్శన్ 365 రన్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. జోస్ బట్లర్ 315 రన్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. యశస్వీ జైస్వాల్ 307 రన్స్‌తో నాల్గో స్థానంలో ఉన్నాడు.