Ravi Shastri: దేశవాళీలో ఆడాలని రోహిత్-విరాట్‌లకు రవిశాస్త్రి సలహా
దేశవాళీ క్రికెట్‌లో ఆడటం వల్ల కొత్త తరానికి అలవాటు పడేందుకు, యువ ఆటగాళ్లతో తమ అనుభవాలను పంచుకునేందుకు అవకాశం ఉంటుందని ఐసీసీ సమీక్షలో శాస్త్రి చెప్పాడు.
- Author : Naresh Kumar
Date : 08-01-2025 - 5:06 IST
Published By : Hashtagu Telugu Desk
Ravi Shastri: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఘోర పరాజయం తర్వాత రోహిత్-విరాట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తుది జట్టుకు దూరమయ్యాడు. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ విధంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-1తో ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుని డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంది. 10 సంవత్సరాల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓటమిని ఎదుర్కొంది. ఈ సిరీస్ తర్వాత రోహిత్-విరాట్‌ల ఫామ్ పై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రోకో ఫామ్‌లోకి తిరిగి రావాలంటే వాళ్ళు కచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందేనని చెప్పాడు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri).
ఆస్ట్రేలియాలో పర్యటనలో కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ తొలి టెస్టులో సెంచరీ చేశాడు. అయితే మిగిలిన నాలుగు టెస్టుల్లో తేలిపోయాడు. తనకు ఇష్టమైన షాట్లు కొట్టడంలో ఇబ్బంది పడ్డాడు. విరాట్ మిగిలిన మ్యాచ్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 23.95 సగటుతో 190 పరుగులు మాత్రమే చేశాడు. విశేషమేంటంటే ఆఫ్ స్టంప్ వెలుపల బంతుల్లో విరాట్ కోహ్లీ 8 సార్లు ఔట్ అయ్యాడు. ఇక వీరిద్దరి పేలవమైన ఫామ్‌ను చూసి మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రవిశాస్త్రి మాత్రం వాల్లిద్దరు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని సలహా ఇచ్చాడు.
Also Read: Sheikh Hasina : షేక్ హసీనా వీసా గడువు పొడిగించిన భారత్..!
దేశవాళీ క్రికెట్‌లో ఆడటం వల్ల కొత్త తరానికి అలవాటు పడేందుకు, యువ ఆటగాళ్లతో తమ అనుభవాలను పంచుకునేందుకు అవకాశం ఉంటుందని ఐసీసీ సమీక్షలో శాస్త్రి చెప్పాడు. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే రోహిత్ కోహ్లీ దేశీయ క్రికెట్ ఆడటం ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. దేశవాళీలో స్పిన్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో అర్ధమవుతుంది. దీంతో పాటు టెస్టు క్రికెట్‌లో కోహ్లీ, రోహిత్ భవిష్యత్తు వాళ్లపైనే ఆధారపడి ఉంటుందని శాస్త్రి చెప్పాడు.