HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Pbks Beat Gt Pbks Won By 3 Wickets

గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘ‌న‌విజ‌యం!

163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు కూడా ఆరంభంలోనే షాక్ తగిలింది. ప్రియాంశ్ ఆర్య కేవలం 7 పరుగులకే అవుట్ అయ్యాడు.

  • Author : Gopi Date : 31-03-2026 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
PBKS Beat GT
PBKS Beat GT

PBKS Beat GT: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ర‌స‌వత్త‌ర పోరు జ‌రిగింది. ముల్లాన్‌పూర్ (న్యూ చండీగఢ్)లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ కూపర్ కోనోలీ అద్భుత బ్యాటింగ్‌తో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఈ సీజన్‌లో తమ పాయింట్ల ఖాతాను తెరిచింది.

గుజరాత్ టైటాన్స్ గౌరవప్రదమైన స్కోరు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. సాయి సుదర్శన్ కేవలం 13 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 27 బంతుల్లో 39 పరుగులు చేయగా, వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ 33 బంతుల్లో 38 పరుగులు జోడించారు. మిడిల్ ఆర్డర్‌లో గ్లెన్ ఫిలిప్స్ (25), వాషింగ్టన్ సుందర్ (18) పరుగులు చేశారు. చివర్లో రాహుల్ తెవాటియా 11 పరుగులు చేయడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది.

Also Read: టీం ఇండియా బిజీ షెడ్యూల్.. ఐపీఎల్ తర్వాత జింబాబ్వే పర్యటనకు!

పంజాబ్ బౌలింగ్‌లో విజయ్‌కుమార్ వైషాక్ 3 వికెట్లతో రాణించగా, యుజ్వేంద్ర చాహల్ 4 ఓవర్లలో కేవలం 28 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్‌కు ఒక వికెట్ దక్కింది.

కూపర్ కోనోలీ మెరుపులు.. పంజాబ్ ఘనవిజయం

163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు కూడా ఆరంభంలోనే షాక్ తగిలింది. ప్రియాంశ్ ఆర్య కేవలం 7 పరుగులకే అవుట్ అయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 24 బంతుల్లో 37 పరుగులు చేయగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 18 పరుగులు చేశాడు. అయితే, ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్న యువ ఆస్ట్రేలియా బ్యాటర్ కూపర్ కోనోలీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో ఆడిన కోనోలీ 44 బంతుల్లో నాటౌట్‌గా 72 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీనివల్ల పంజాబ్ జట్టు చివరి ఓవర్లో 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cooper Connolly
  • IPL 2026
  • IPL News
  • PBKS Beat GT
  • punjab kings

Related News

Krunal Pandya wins the IPL title for the fifth time.

Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవడంతో కృనాల్ తన కెరీర్ లో ఐదో ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. త‌ద్వారా ఐపీఎల్ లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్ల ఎలైట్ క్లబ్ లో చేరాడు. దిగ్గజాల సరసన కృనాల్ ఐపీఎల్ లో అత్యధిక టైటిళ

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd