Pakistan Squad: జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్లు..!
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన జట్టు (Pakistan Squad)ను ప్రకటించింది.
- Author : Gopichand
Date : 10-04-2024 - 9:11 IST
Published By : Hashtagu Telugu Desk
Pakistan Squad: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన జట్టు (Pakistan Squad)ను ప్రకటించింది. ఏప్రిల్ 18 నుంచి పాకిస్థాన్-న్యూజిలాండ్ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కాగా పీసీబీ ఇటీవల బాబర్ అజమ్‌ను టీ20, వన్డేలకు కెప్టెన్‌గా చేసింది. ఇప్పుడు అతను న్యూజిలాండ్‌పై పునరాగమనం చేసి మొదటిసారి కెప్టెన్‌గా కనిపించనున్నాడు. ఇది కాకుండా వెటరన్ పేసర్ మహ్మద్ అమీర్, ఆల్ రౌండర్ ఇమాద్ వాసిమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చారు.
జట్టులోకి అమీర్, ఇమాద్
న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మహ్మద్ అమీర్, ఇమాద్ వసీమ్‌లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అవకాశం ఇచ్చింది. అమీర్, ఇమాద్ ICC T20 ప్రపంచ కప్ 2024 కోసం తమ రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకున్నారు. పీసీబీ ఇప్పుడు వారిని న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేసింది. దీనికి ముందు అమీర్ మూడున్నరేళ్ల క్రితం పాకిస్థాన్ తరఫున ఆడాడు. కాగా ఇమాద్ చివరిసారిగా 2023లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు ఆడబోతున్నారు.
Also Read: PBKS vs SRH: 2 పరుగుల తేడాతో పంజాబ్ ను ఓడించిన సన్‌రైజర్స్
హరీస్ రవూఫ్‌కు చోటు దక్కలేదు
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో స్టార్ పేసర్ హరీస్ రవూఫ్‌కు అవకాశం దక్కలేదు. నిజానికి హరీస్ చాలా కాలంగా గాయాలతో బాధపడుతున్నాడు. కానీ అతను PSL 2024లో తిరిగి వచ్చాడు. లాహోర్ ఖలందర్స్‌కు ఆడుతున్నప్పుడు అతను క్యాచ్ తీసుకుంటుండగా భుజానికి గాయమైంది. ఆ తర్వాత భుజానికి బ్యాండేజీతో కూడా కనిపించి ఆ తర్వాత మొత్తం టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి?
న్యూజిలాండ్ ఐదు టీ20 మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 18న, చివరి మ్యాచ్ ఏప్రిల్ 27న జరగనుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోని రావల్‌పాండి, లాహోర్‌లలో జరుగుతాయి. టీ20 ప్రపంచకప్‌కు ముందు టీ20 సిరీస్ ఆడడం పాకిస్థాన్‌కు మేలు చేస్తుంది. దీంతో జట్టు ప్రాక్టీస్ కూడా పూర్తవుతుంది.
We’re now on WhatsApp : Click to Join
పాకిస్తాన్ జట్టు
బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ అమీర్, ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సామ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ ఖాన్ మిర్, జమాన్ ఖాన్.