Online Gaming Bill: లోక్‌సభలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం.. ప్రముఖ బెట్టింగ్ యాప్‌లపై నిషేధం?!
క్యాండీ క్రష్, లూడో వంటి గేమ్స్ దీని కిందికి వస్తాయి. భారత ప్రభుత్వం ఆన్‌లైన్ గేమ్‌లను రెండు కేటగిరీలుగా విభజించాలని నిర్ణయించింది.
- By Gopichand Published Date - 03:46 PM, Thu - 21 August 25

Online Gaming Bill: లోక్‌సభలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 (Online Gaming Bill) ఆమోదం పొందిన తర్వాత, భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఈ బిల్లు ప్రకారం.. డబ్బుతో కూడిన గేమింగ్ యాప్‌లు, సైట్‌లపై ప్రభుత్వం నియంత్రణ విధించనుంది. అదే సమయంలో దేశంలో ఈ-స్పోర్ట్స్ (E-Sports) ను ప్రోత్సహించనుంది. ఈ కొత్త చట్టం My11Circle వంటి యాప్‌లపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
My11Circle పై నిషేధం ముప్పు
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 ఆమోదం పొందిన తర్వాత My11Circle వంటి ప్లాట్‌ఫారమ్‌లు ప్రమాదంలో పడ్డాయి. ఈ యాప్‌లు ప్రజలను కోటీశ్వరులు చేస్తామంటూ ఆశ పెడతాయి. My11Circle యాప్‌లో ప్రజలు తమ సొంత క్రికెట్ టీమ్‌ను తయారు చేసుకొని డబ్బులు పెడతారు. కానీ, మీరు పెట్టిన కొద్ది డబ్బుతో కోట్లు గెలుస్తారనేందుకు ఎలాంటి హామీ ఉండదు. ఈ యాప్‌కు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఇలాంటి యాప్‌లలో డబ్బు పోగొట్టుకుని, ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి.
Also Read: Anemia : అనీమియా అంటే ఏంటీ..?అనీమియాపై ఉన్న అపోహలు.. వాస్తవాలు..ఏమిటో తెలుసుకుందాం..!
My11Circle యాప్‌లో లైవ్ మ్యాచ్ సమయంలో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా పాయింట్లు లభిస్తాయి. లక్షలాది మంది ఈ యాప్‌లో టీమ్స్‌ను క్రియేట్ చేసి డబ్బులు పెడతారు. మీ టీమ్‌కి ఎక్కువ పాయింట్లు వస్తే, ఎక్కువ డబ్బులు గెలుస్తారు. కానీ, పాయింట్లు తక్కువ వస్తే, డబ్బు పోగొట్టుకుంటారు. ఇది ఒక రకంగా పందెం లాంటిది.
ఈ-స్పోర్ట్స్ కు ప్రోత్సాహం
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 ప్రకారం.. భారతదేశంలో డబ్బుతో సంబంధం లేని ఈ-స్పోర్ట్స్, సోషల్ గేమ్‌లకు ప్రోత్సాహం లభిస్తుంది. దీనివల్ల భారతదేశంలో ఒక పెద్ద గేమింగ్ మార్కెట్ సృష్టించబడుతుంది. క్యాండీ క్రష్, లూడో వంటి గేమ్స్ దీని కిందికి వస్తాయి. భారత ప్రభుత్వం ఆన్‌లైన్ గేమ్‌లను రెండు కేటగిరీలుగా విభజించాలని నిర్ణయించింది. ఈ-స్పోర్ట్స్, రియల్ మనీ గేమ్స్. ఈ-స్పోర్ట్స్ కేటగిరీలో డబ్బు లావాదేవీలు లేని గేమ్స్ ఉంటాయి. కాగా రియల్ మనీ గేమ్స్ కేటగిరీలో డబ్బుతో ఆడే గేమ్స్ ఉంటాయి. ఈ చట్టం వల్ల ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలో పారదర్శకత పెరుగుతుందని, ప్రజలు మోసపోకుండా ఉంటారని ప్రభుత్వం ఆశిస్తోంది.