New Cricket Stadium : ఏపీలో కొత్తగా క్రికెట్ స్టేడియం..ఎక్కడంటే !
New Cricket Stadium : తిరుపతిలోని గొల్లవానిగుంటలో స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మించిన క్రికెట్ స్టేడియంను శాప్ (SAP) ఆధీనంలోకి తీసుకుంది
- By Sudheer Published Date - 01:50 PM, Mon - 24 March 25

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) రాష్ట్రంలో క్రీడా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా క్రికెట్ స్టేడియం(Cricket Stadium)ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోంది. అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మరో ముఖ్య పట్టణమైన తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ గ్రౌండ్లు, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం చర్యలు చేపట్టారు. తిరుపతిలోని గొల్లవానిగుంటలో స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మించిన క్రికెట్ స్టేడియంను శాప్ (SAP) ఆధీనంలోకి తీసుకుంది. ఈ స్టేడియాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, ఆటగాళ్లకు ప్రాక్టీస్, మ్యాచ్‌ల నిర్వహణకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు.
Betting App Case : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు శ్యామల
తిరుపతిలో ఇప్పటికే ఉన్న శ్రీశ్రీనివాస క్రీడా సముదాయానికి అనుసంధానంగా కొత్త క్రికెట్ స్టేడియాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. అంతేకాదు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు తిరుపతిలో క్రికెట్ టోర్నీలు, ప్రాక్టీస్‌లు ఎస్వీయూ తారకరామ మైదానం వద్దే నిర్వహించేవారు. కానీ కొత్తగా అభివృద్ధి చేస్తున్న స్టేడియంతో ఆటగాళ్లకు మరింత విస్తృత స్థాయిలో సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రయత్నంలో శాప్ ఛైర్మన్ రవి నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, కమిషనర్ మౌర్యతో చర్చించి, స్టేడియంను శాప్ ఆధీనంలోకి తీసుకునేలా ఒప్పించారు.
ప్రస్తుతం ఈ స్టేడియంలో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. స్టేడియంలో 65 మంది సీటింగ్ సామర్థ్యం కలిగిన పెవిలియన్, 315 మంది సామర్థ్యం గల గ్యాలరీ నిర్మాణ దశలో ఉంది. రూ.6 కోట్ల నిధుల్లో రూ.4.5 కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. గొల్లవానిగుంటలో సమీకృత క్రీడా సముదాయం నిర్మాణానికి అదనంగా రూ.2 కోట్ల ప్రతిపాదనను సిద్ధం చేశారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి పూర్తయిన తర్వాత, ఈ స్టేడియంలో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి టోర్నీలు నిర్వహించేందుకు అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ అభివృద్ధితో తిరుపతి, క్రీడా హబ్‌గా మారబోతోందని క్రీడా ప్రియులు ఆశిస్తున్నారు.
Hanmanthraopet Old Houses : మీరు అలాంటి కట్టడాలు చూడాలంటే హన్మంతరావుపేట కు వెళ్లాల్సిందే