HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Mumbai Indians To Organise Three Week Exposure Trip To Uk For Uncapped Indians

Mumbai Indians: ఇంగ్లాండ్ టూర్ కు ముంబై ఇండియన్స్ క్రికెటర్లు

ఐపీఎల్ 15వ సీజన్ లో తనదైన బ్యాటింగ్ తో అందరి దృష్టినీ ఆకట్టుకున్న బ్యాటర్ తెలుగుతేజం తిలక్ వర్మ.

  • By Hashtag U Published Date - 08:15 PM, Wed - 29 June 22
  • daily-hunt
Mumbai Indians
Mumbai Indians

ఐపీఎల్ 15వ సీజన్ లో తనదైన బ్యాటింగ్ తో అందరి దృష్టినీ ఆకట్టుకున్న బ్యాటర్ తెలుగుతేజం తిలక్ వర్మ. అరంగేట్రంలోనే అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు. ముంబై ఈ సీజన్ లో నిరాశపరిచినా.. బ్యాటింగ్ పరంగా సీనియర్లంతా విఫలమైనా తిలక్ వర్మ మాత్రం నిలకడగా రాణించాడు.

అతనితో పాటు కొందరు యువ క్రికెటర్లు సత్తా చాటారు. దీంతో వీరందరికీ తమ ఆట మరింత మెరుగుపరుచుకునేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అవకాశం కల్పించింది. ఇంగ్లండ్‌లోని అగ్రశ్రేణి టీ20 క్లబ్‌లతో మ్యాచ్‌లు ఆడేందుకు వీలుగా ఫ్రాంఛైజీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వీరంతా మూడు వారాల పాటు యూకేలో గడుపనున్నారు. వచ్చే ఏడాది ఎడిషన్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ముంబై ఫ్రాంఛైజీ ఈ మేరకు యువ ఆటగాళ్లను ఇంగ్లండ్‌ టూర్‌కు పంపుతున్నట్లు తెలుస్తోంది.

అక్కడి టాప్‌ కౌంటీ క్లబ్‌తో పోటీ పడేందుకు వీలుగా సుమారు 10 టీ20 మ్యాచ్‌లు ఆడించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అర్జున్‌ టెండుల్కర్‌ యూకే చేరుకున్నాడు. ఇక దక్షిణాఫ్రికా సంచలనం డెవాల్డ్‌ బ్రెవిస్‌ సైతం వీరితో చేరునున్నాడని ముంబై ఇండియన్స్ వర్గాలు తెలిపాయి. తాజాగా భారత్‌కు చెందిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లను మాత్రమే ఈ ట్రిప్‌నకు తీసుకువెళ్తున్నామని.. ఇది కమర్షియల్‌ టూర్‌ కాదని.. కాబట్టి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించాయి. ఈ జాబితాలో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ కూడా ఉన్నాడు. ఐపీఎల్‌ 2022 సీజన్ లో తిలక్ వర్మ 397 పరుగులు చేసి ముంబై తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇంగ్లాండ్ పరిస్థితుల్లో రాణిస్తే ఈ యువక్రికెటర్లంతా విజయవంతమైనట్టేనని చెప్పొచ్చు. రానున్న రోజుల్లోనూ ఈ అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంగ్లాండ్ టూర్ కు వెళుతున్న వారిలో తిలక్‌ వర్మ తో పాటు కుమార్‌ కార్తికేయ, హృతిక్‌ షోకేన్‌, మయాంక్‌ మార్కండే, రాహుల్‌ బుద్ధి, రమణ్‌దీప్‌ సింగ్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, బాసిల్‌ థంపి, మురుగన్‌ అశ్విన్‌, ఆర్యన్‌ జుయాల్‌, ఆకాశ్‌ మెధ్వాల్‌, అర్షద్‌ ఖాన్‌, అర్జున్‌ టెండుల్కర్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఉన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 3 week exposure trip
  • IPL
  • mumbai indians
  • UK
  • uncapped players

Related News

    Latest News

    • Asia Cup: మ‌రోసారి భార‌త్‌- పాక్ మ్యాచ్‌.. ఎప్పుడంటే!?

    • Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ కేసు నమోదు

    • Trump: అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • Heavy Rains: నేడు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించిన ఐఎండీ!

    • BlackBuck : ‘బ్లాక్‌బక్’ సంస్థకు లోకేష్ ఆహ్వానం

    Trending News

      • Masood Azhar: ఢిల్లీ, ముంబై ఉగ్ర‌దాడుల ప్ర‌ధాన సూత్ర‌ధారి ఎవ‌రంటే?

      • Team India New Sponsor: టీమిండియా కొత్త జెర్సీ స్పాన్స‌ర్ ఇదే.. డీల్ ఎంతంటే?

      • ITR Filing Due Date: ఐటీఆర్ ఫైల్ చేయ‌నివారికి మ‌రో ఛాన్స్‌.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

      • New GST Rate: గుడ్ న్యూస్‌.. భారీగా త‌గ్గిన పాలు, నెయ్యి ధ‌ర‌లు!

      • Beggars Homes: బెగ్గర్స్‌ హోమ్స్‌ జైళ్ల కంటే దారుణం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd