Dhoni Bat Price: ప్రపంచకప్ ఫైనల్లో సిక్స్ కొట్టిన ధోనీ బ్యాట్ ధర ఎంత?
2011 వరల్డ్ కప్ ప్రస్తావన వస్తే చివర్లో ధోనీ కొట్టిన సిక్స్ గురించి మాట్లాడుకుంటారు. ధోని ఆ షాట్ ఆడిన క్షణం.. 130 కోట్ల హృదయాలు భావోద్వేగంతో ఉప్పొంగాయి.
- By Praveen Aluthuru Published Date - 03:03 PM, Thu - 10 August 23

Dhoni Bat Price: 2011 వరల్డ్ కప్ ప్రస్తావన వస్తే చివర్లో ధోనీ కొట్టిన సిక్స్ గురించి మాట్లాడుకుంటారు. ధోని ఆ షాట్ ఆడిన క్షణం.. 130 కోట్ల హృదయాలు భావోద్వేగంతో ఉప్పొంగాయి. టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా అవసరించిన క్షణం అది. శ్రీలంకతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మహేంద్ర సింగ్ ధోనీ ఆఖర్లో సిక్స్ బాది 28 ఏళ్ల వరల్డ్ కప్ కలను సాకారం చేశాడు. చారిత్రక క్షణాలకి సాక్షిభూతంగా ఉన్న ఆ బ్యాట్ ధర ఎంతో తెలుసా అక్షరాలా .83 లక్షలు. 2011 వన్డే ప్రపంచకప్‌లో మొదట్నుంచి ధోనీ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. కానీ.. ఫైనల్లో మాత్రం ఐదో స్థానంలో వచ్చి ఎడాపెడా బాదేశాడు. నిజానికి ఆ సమయంలో యూవీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. స్పిన్నర్లు దాడికి సిద్ధంగా ఉండటంతో స్పిన్నర్లను యూవీ ఎదుర్కోవడం కష్టమని ధోనీ బరిలోకి దిగాడు. ఆ ఇన్నింగ్స్ లో ధోనీ 79 బంతుల్లో 91 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 8 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. కానీ ధోనీ కొట్టిన చివరి సిక్స్ ప్రపంచ క్రికెట్ పుస్తకంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
Also Read: KCR Strategy: కేసీఆర్ మరో సంచలనం.. నిరుద్యోగ భృతి ప్రకటించే ఛాన్స్?