MS Dhoni: ధోని మోకాలి ఆపరేషన్ సక్సెస్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆపరేషన్ సక్సెస్ అయిందని, ధోనీ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని చెన్నై ప్రాంచైజీ వర్గాలు చెబుతున్నాయి.
- By Praveen Aluthuru Published Date - 08:26 PM, Thu - 1 June 23

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆపరేషన్ సక్సెస్ అయిందని, ధోనీ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని చెన్నై ప్రాంచైజీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ధోని డిశ్చార్జ్ అవడానికి కొంత సమయం పడుతుంది. దీంతో ధోని మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంటారు.
చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. గురువారం ఉదయం శస్త్రచికిత్స తర్వాత ధోనీతో మాట్లాడినట్లు వెల్లడించారు. ధోనీకి జరిగింది కీ-హోల్ సర్జరీ కాశీ విశ్వనాధ్ తెలిపారు. గతంలో ఇలాంటి సమస్యతో రిషబ్ పంత్‌కు ఆపరేషన్ చేసిన స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దిన్షా పార్దివాలా, ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో ధోనీ (41)కి ఆపరేషన్ చేశారు. ఆసుపత్రిలో ధోని భార్య సాక్షి అతనితో పాటు ఉన్నారు. ఈ చికిత్స కోసం ధోని మే 31 బుధవారం ఆసుపత్రిలో చేరాడు.
The pillar on which the pride stands! 🦁💪🏻#WhistlePodu #Yellove 💛 @msdhoni pic.twitter.com/Ke67bTS7Co
— Chennai Super Kings (@ChennaiIPL) June 1, 2023
ఐపీఎల్ 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఐదో సారి కప్ గెలుచుకుంది. ఐపీఎల్‌లో ఐదో టైటిల్‌ను గెలుచుకున్న రెండో జట్టుగా చెన్నై నిలిచింది. చెన్నై కంటే ముందు ముంబై ఐదు ట్రోఫీలను గెలుచుకుంది. విశేషం ఏంటంటే ఐపీఎల్ ఫైనల్ గెలిచిన తర్వాత ధోనీ మాట్లాడుతూ.. ప్రేక్షకుల ప్రేమను చూసి మరో సీజన్ ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో సగటు క్రికెట్ అభిమాని ఆనందానికి హద్దుల్లేకుండాపోయింది.
Read More: Retirement Age: ఉద్యోగులకు శుభవార్త.. రిటైర్మెంట్ ఏజ్ రెండేళ్లు పెంపు.. కానీ?