HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ms Dhoni Makes Big Remark On Future With Csk

MS Dhoni: ఐపీఎల్ 2026లో ఎంఎస్ ధోనీ ఆడ‌తాడా? లేదా?

గత రెండు-మూడు సీజన్ల నుంచి ధోనీ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి, సీజన్ ముగిసిన కొన్ని నెలల తర్వాతే ఈ ప్రశ్న మళ్లీ తెరపైకి రావడం CSK అభిమానులలో ఆందోళన కలిగించింది.

  • Author : Gopi Date : 07-08-2025 - 8:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MS Dhoni
MS Dhoni

MS Dhoni: భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజ ఆట‌గాడు ఎంఎస్ ధోనీ (MS Dhoni) తన ఐపీఎల్ భవిష్యత్తుపై మరోసారి అభిమానుల ఉత్కంఠను పెంచాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ధోనీ ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే 2025 సీజన్‌లో CSK పాయింట్ల పట్టికలో అత్యంత నిరాశాజనకంగా నిలవడంతో ఐపీఎల్ 2026లో ధోనీ ఆడతాడా? అనే ప్రశ్న ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతోంది.

ధోనీ ఇచ్చిన సమాధానం

ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎంఎస్ ధోనీ తన భవిష్యత్తుపై మాట్లాడుతూ.. అభిమానుల్లో ఆశలు నింపే విధంగానే సమాధానం ఇచ్చాడు. “నేను ఇంకా 15-20 సంవత్సరాలు ఆడతానని ప్రజలు ఆశించకూడదు. ఇది కేవలం ఒకటి లేదా రెండు సంవత్సరాల విషయం కాదు, మీరు నన్ను ఎల్లప్పుడూ పసుపు జెర్సీ (CSK)లోనే చూస్తారు” అని అన్నాడు. అయితే, “నేను ఇకపై ఆడతానా లేదా అనేది మీరు స్వయంగా తెలుసుకోవాలి” అని చెప్పి, తన భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగించాడు.

Also Read: Green Energy Corridor: గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు అనుమతివ్వండి.. కేంద్ర మంత్రిని కోరిన డిప్యూటీ సీఎం!

గత రెండు-మూడు సీజన్ల నుంచి ధోనీ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి, సీజన్ ముగిసిన కొన్ని నెలల తర్వాతే ఈ ప్రశ్న మళ్లీ తెరపైకి రావడం CSK అభిమానులలో ఆందోళన కలిగించింది. గతంలో, జాతీయ జట్టుకు ఆడటం తర్వాత తనకు ఇష్టమైన రెండవ విషయం ఐపీఎల్‌లో ఆడటమేనని ధోనీ చెప్పాడు.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

గత కొన్నేళ్లుగా ధోనీ బ్యాటింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. అతను ఐపీఎల్‌లో చివరిసారిగా 2022 సీజన్‌లో KKRతో ఆడిన మ్యాచ్‌లో 50 పరుగుల మార్క్‌ను దాటాడు. ఆ తర్వాత 48 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసినప్పటికీ అతని బ్యాట్ నుండి ఒక్క అర్ధ సెంచరీ కూడా రాలేదు. గత ఐదు సీజన్లలో ధోనీ మొత్తం కలిపి కేవలం 807 పరుగులు మాత్రమే చేయగలిగాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CSK
  • IPL 2025-26
  • ms dhoni
  • MS Dhoni news
  • MS Dhoni Retirement
  • sports news

Related News

Krunal Pandya wins the IPL title for the fifth time.

Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలవడంతో కృనాల్ తన కెరీర్ లో ఐదో ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. త‌ద్వారా ఐపీఎల్ లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్ల ఎలైట్ క్లబ్ లో చేరాడు. దిగ్గజాల సరసన కృనాల్ ఐపీఎల్ లో అత్యధిక టైటిళ

    Latest News

    • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

    • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

    • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

    • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

    • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd