Ziva Dhoni: ధోనీ కుమార్తె జీవా స్కూల్ ఫీజ్ ఎంతో తెలుసా?
ప్రపంచ క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ స్థాయి ప్రత్యేకం. దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి పెట్టిన మాహీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
- By Praveen Aluthuru Published Date - 04:21 PM, Sat - 5 August 23

Ziva Dhoni: ప్రపంచ క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ స్థాయి ప్రత్యేకం. దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి పెట్టిన మాహీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సిక్సర్లు కొట్టాలన్నా, వికెట్ కీపింగ్ చేయాలన్నా, ఫీల్డింగ్ సెట్ చేయాలన్నా మాహీ తరువాతనే ఎవరైనా. రెప్పపాటులో స్టంపింగ్‌లు చేయడంలో ధోనీ స్టైలే వేరు. కీపర్‌గా, బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ధోనీ ఆ బాధ్యతలకే వన్నె తీసుకొచ్చాడు. 2019లో ధోనీ క్రికెట్ ప్రపంచానికి షాకిస్తూ తన క్రికెట్ జర్నీకి గుడ్ బాయ్ చెప్పాడు. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్ ఫార్మెట్లో మాత్రమే ఆడుతున్నాడు.
ధోనీ ప్రస్తుతం కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. ఆట నుంచి తీరిక దొరికినప్పుడల్లా తన ముద్దులు కూతురు జీవాతో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతున్నాడు. ఈ క్రమంలో జీవాతో గడిపిన క్షణాల్ని ధోనీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటాడు. అయితే ఈ మధ్య జీవా ఎం చదువుతుంది, ఆమె స్కూల్ పేరేంటి, స్కూల్ ఫీజెంత అన్న విషయాలపై నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. రాంచీలోని టౌరియన్ వరల్డ్ స్కూల్లో జీవా 3వతరగతి చదువుతోంది. జీవా స్కూలు ఫీజు కోసం ధోనీ సంవత్సరానికి 2,75,000 రూపాయలు చెల్లిస్తున్నాడు. చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ధోనీ జీవా విషయంలో ఎక్కువ జాగ్రత్త పడుతున్నాడు. ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్‌లలో రాణించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు.
Also Read: Kokapet Lands : క్లిన్ కార పేరు బలం..అప్పుడే చిరంజీవి ఫ్యామిలీకి 2000 కోట్ల లాభం