సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మరో 3 సెంచరీలు చేస్తే చరిత్రే!
ఆంధ్రపై చేసిన సెంచరీ విరాట్ కోహ్లీ లిస్ట్-A కెరీర్‌లో 58వ సెంచరీ. ఈ విభాగంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు. సచిన్ రికార్డును అధిగమించడానికి ఆయనకు మరో 3 సెంచరీలు అవసరం.
- Author : Gopichand
Date : 25-12-2025 - 7:55 IST
Published By : Hashtagu Telugu Desk
Most Centuries: విజయ్ హజారే ట్రోఫీ 2025-26 మొదటి రోజే విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో విరుచుకుపడ్డారు. ఢిల్లీ తరఫున ఆడుతూ ఆంధ్రప్రదేశ్‌పై 131 పరుగుల అద్భుత సెంచరీతో జట్టుకు 4 వికెట్ల విజయాన్ని అందించారు. ఈ సెంచరీతో కోహ్లీ, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఒక భారీ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసే దిశగా అడుగులు వేశారు.
లిస్ట్-A క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు
ఆంధ్రపై చేసిన సెంచరీ విరాట్ కోహ్లీ లిస్ట్-A కెరీర్‌లో 58వ సెంచరీ. ఈ విభాగంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు. సచిన్ రికార్డును అధిగమించడానికి ఆయనకు మరో 3 సెంచరీలు అవసరం.
Also Read: రైల్వేలో ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ వివరాలీవే!
లిస్ట్-A క్రికెట్‌లో టాప్ సెంచరీ మేకర్లు
- సచిన్ టెండూల్కర్: 60 సెంచరీలు
- విరాట్ కోహ్లీ: 58 సెంచరీలు
- గ్రహం గూచ్: 44 సెంచరీలు
- గ్రేమ్ హిక్: 40 సెంచరీలు
- కుమార్ సంగక్కర: 39 సెంచరీలు
ఈ రికార్డును కోహ్లీ ఎలా సాధించగలరు?
బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ ఆటగాళ్లందరూ దేశవాళీ లిస్ట్-A టోర్నమెంట్లలో కనీసం 2 మ్యాచ్‌లు ఆడాలి. కోహ్లీ తన తదుపరి మ్యాచ్‌ను డిసెంబర్ 26న గుజరాత్‌తో ఆడనున్నారు. ఒకవేళ గుజరాత్‌పై కూడా కోహ్లీ సెంచరీ చేస్తే ఆయన ఖాతాలో 59 సెంచరీలు చేరుతాయి. వన్డే ఇంటర్నేషనల్స్ (ODI) కూడా లిస్ట్-A క్రికెట్ పరిధిలోకి వస్తాయి. కాబట్టి, జనవరి 2026లో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో మరో 2 సెంచరీలు సాధిస్తే, సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి లిస్ట్-A క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టిస్తారు.