HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Sports News
  • ⁄Mohammed Shami As Court Orders Him To Pay Monthly Alimony To Estranged Wife Hasin Jahan

Team India Cricketer: టీమిండియా స్టార్ పేసర్ కి షాకిచ్చిన కోర్టు

టీమిండియా ఆటగాడు మహమ్మద్ షమీ (Mohammed Shami)కి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన మాజీ భార్య హసిన్ జహన్‌కు నెలవారీ భరణం తప్పకుండా చెల్లించాలని కోల్‌కతా కోర్టు ఆదేశించింది. షమీ తనను వేధిస్తున్నాడని గతంలో హసిన్ కేసు పెట్టింది.

  • By Gopichand Published Date - 09:45 AM, Tue - 24 January 23
Team India Cricketer: టీమిండియా స్టార్ పేసర్ కి షాకిచ్చిన కోర్టు

టీమిండియా ఆటగాడు మహమ్మద్ షమీ (Mohammed Shami)కి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన మాజీ భార్య హసిన్ జహన్‌కు నెలవారీ భరణం తప్పకుండా చెల్లించాలని కోల్‌కతా కోర్టు ఆదేశించింది. షమీ తనను వేధిస్తున్నాడని గతంలో హసిన్ కేసు పెట్టింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆమెకు ప్రతినెలా రూ. 50 వేలు భరణం చెల్లించాలని షమీని ఆదేశించింది. అలీపూర్ కోర్టు న్యాయమూర్తి అనిందితా గంగూలీ ఈ అంశంపై తీర్పును ప్రకటించారు. షమీ విడిపోయిన తన భార్య హసిన్ జహాన్‌కు నెలవారీ రూ.1.30 లక్షల భరణం చెల్లించాలని కోల్‌కతా కోర్టు సోమవారం ఆదేశించింది. రూ.1.30 లక్షలలో రూ.50,000 హసిన్ జహాన్‌కు వ్యక్తిగత భరణం, మిగిలిన రూ.80,000 ఆమెతో ఉంటున్న వారి కుమార్తె పోషణ ఖర్చుకు ఇవ్వాలని పేర్కొంది.

అయితే ఈ మొత్తంపై హాసిన్ జహాన్ సంతృప్తి చెందలేదు. ఎందుకంటే నెలకు రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. 2018 సంవత్సరంలో హసిన్ జహాన్ నెలవారీ భరణం రూ. 10 లక్షలు డిమాండ్ చేస్తూ లీగల్ పిటిషన్‌ను దాఖలు చేసింది. వ్యక్తిగత ఖర్చుల కోసం రూ.7 లక్షలు, తన కూతురి పోషణకు నెలకు రూ.3 లక్షల భరణం ఇవ్వాలని హసిన్ జహాన్ పిటిషన్‌లో పేర్కొంది. ఈ తీర్పుపై హసిన్ జహాన్ ఇప్పుడు హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.

Also Read: IND vs NZ ODI: క్లీన్​స్వీప్​కు వేళాయే.. ఇండోర్ వేదికగా నేడు మూడో వన్డే

2018లో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వ్యక్తిగత జీవితంలో కుదుపు వచ్చింది. షమీ భార్య హసీన్ జహాన్ షమీపై గృహ హింస, మ్యాచ్ ఫిక్సింగ్, వరకట్న వేధింపుల వంటి తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీంతో మహ్మద్ షమీ తన భార్య ఆరోపణలపై క్లారిటీ ఇచ్చాడు. తర్వాత షమీ, హసిన్ జహాన్ విడిపోయారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత పేసర్ ఆదాయపు పన్ను రిటర్న్ ప్రకారం ఆ ఆర్థిక సంవత్సరంలో అతని వార్షిక ఆదాయం రూ. 7 కోట్ల కంటే ఎక్కువగా ఉందని, దాని ఆధారంగా నెలవారీ ఆదాయాన్ని కోరినట్లు అతని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. రూ.10 లక్షల భరణం సబబు కాదన్నారు. అయితే, షమీ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. హసిన్ జహాన్ స్వయంగా వృత్తిరీత్యా ఫ్యాషన్ మోడల్‌గా పని చేయడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నందున అధిక భరణం డిమాండ్ సమర్థించబడదని పేర్కొన్నారు.

Telegram Channel

Tags  

  • Hasin Jahan
  • Kolkata court
  • Mohammed Shami
  • shami
  • Team India Cricketer

Related News

India Vs NZ 2nd ODI: రాయ్‌పూర్‌లో బౌలర్లు అదుర్స్…భారత్ ఖాతాలో మరో సిరీస్‌

India Vs NZ 2nd ODI: రాయ్‌పూర్‌లో బౌలర్లు అదుర్స్…భారత్ ఖాతాలో మరో సిరీస్‌

సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వన్డేల్లో నెంబర్ వన్ టీమ్ న్యూజిలాండ్‌ను చిత్తూ చేస్తూ సిరీస్ కైవసం చేసుకుంది.

  • Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ కు తీవ్ర గాయాలు

    Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ కు తీవ్ర గాయాలు

  • Bangladesh vs India : జడేజా, షమీ ఔట్. తొలి టెస్టుకు రోహిత్ దూరం

    Bangladesh vs India : జడేజా, షమీ ఔట్. తొలి టెస్టుకు రోహిత్ దూరం

  • Umran Malik: బంగ్లాతో వన్డే సిరీస్ కు టీమిండియా స్టార్ పేసర్ ఔట్.. ఉమ్రాన్ మాలిక్ ఇన్..!

    Umran Malik: బంగ్లాతో వన్డే సిరీస్ కు టీమిండియా స్టార్ పేసర్ ఔట్.. ఉమ్రాన్ మాలిక్ ఇన్..!

  • Mohammed Shami: షమీ కీలక వ్యాఖ్యలు.. ప్రాక్టీస్ కు ఎప్పుడూ దూరంగా లేను..!

    Mohammed Shami: షమీ కీలక వ్యాఖ్యలు.. ప్రాక్టీస్ కు ఎప్పుడూ దూరంగా లేను..!

Latest News

  • Night Club : గురుగ్రామ్ లో నైట్‌క్లబ్‌పై పోలీసుల రైడ్‌.. 288 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • U19 Women T20 World Cup 2023: నేడు ఇంగ్లండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. అడుగు దూరంలో టీమిండియా..!

  • Bharat Jodo Yatra: ముగింపు దశకు భారత్ జోడో యాత్ర.. రేపు శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ

  • Who Is Raja Chari: భారత సంతతికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి.. ఎవరీ రాజా జె చారి..?

  • Taliban Bans: మహిళలపై మరో నిషేధం విధించిన తాలిబన్లు.. ఈసారి ఏంటంటే..?

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: