HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Mayank Agarwal Will Lead Sunrisers In Next Ipl Season

Mayanka Agarwal: సన్ రైజర్స్ కెప్టెన్ గా అతనేనా

ఐపీఎల్ మినీ వేలం ముగిసిన నేపథ్యంలో ఇక జట్టు కూర్పుపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. మెగా వేలంతో పోలిస్తే ఈ మినీ వేలంలో రికార్డులు బద్దలయ్యాయి.

  • Author : Naresh Kumar Date : 25-12-2022 - 2:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
2562336 Srh Mayank
2562336 Srh Mayank

ఐపీఎల్ మినీ వేలం ముగిసిన నేపథ్యంలో ఇక జట్టు కూర్పుపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. మెగా వేలంతో పోలిస్తే ఈ మినీ వేలంలో రికార్డులు బద్దలయ్యాయి. కెప్టెన్సీ ఆప్షన్స్ కోసం కొన్ని ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్ళను వేలంలో కొనుగోలు చేశాయి. దీనిలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ను వెతుక్కునే పనిలో పడింది. కేన్ విలియమ్సన్ ను వేలంలోకి వదిలేసిన సన్ రైజర్స్ మయాంక్ అగర్వాల్ ను తీసుకుంది.

కేన్ మామ స్థానంలో మయాంక్ కే పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో మయాంకే ముందున్నాడు. సఫారీ ప్లేయర్ మార్క్ రమ్, భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, మరో యువ ఆటగాడు అభిషేక్ శర్మలు కూడా రేసులో ఉన్నా.. వీరికి ప్రతికూలకంగా కొన్ని అంశాలు ఉన్నాయి. విదేశీ ప్లేయర్ కు జట్టు పగ్గాలు అప్పగించే యోచన సన్ రైజర్స్ కు లేనట్టు తెలుస్తోంది. అటు ఫిట్ నెస్ సమస్యలు భువనేశ్వర్ కు ప్రతికూలంగా మారాయి. ఇక యువ ఆటగాడు అభిషేక్ శర్మ కంటే కూడా అనుభవమున్న మయాంక్ వైపే సన్ రైజర్స్ యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. కోచింగ్ స్టాఫ్ బ్రయాన్ లారా, మురళీధరన్ కూడా మయాంక్ కే పగ్గాలు ఇస్తే బావుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై కొద్ది రోజుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

వేలంలో సన్ రైజర్స్ మయాంక్ ను రూ.8.25 కోట్ల భారీ ధరకు తీసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడి మరీ సన్‌రైజర్స్.. మయాంక్‌ను ఎంచుకుంది. కెప్టెన్సీ ఆప్షన్ కోసమే మయాంక్ ను జట్టులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL
  • mayank
  • SRH
  • Sunrisers Hyderabad

Related News

Kalanithi Maran

రూ. 26,000 కోట్ల నెట్‌వర్త్.. SRH యజమాని ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

వినోద రంగమే కాకుండా క్రీడారంగంలో కూడా కళానిధి మారన్ ఒక పెద్ద పేరు. ఆయనకు మూడు ప్రధాన క్రికెట్ జట్లు ఉన్నాయి.

  • Srh Vs Rcb

    IPL 2026: ఐపీఎల్ 2026..తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ X ఆర్సీబీ

Latest News

  • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

  • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

  • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

  • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

  • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

Trending News

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd